కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం?  రేవంత్ వెంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం!

Publish Date:Jul 7, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఫుల్ జోష్ లో కనిపిస్తున్న కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు మొదలు కాబోతున్నాయని సమాచారం. గతంలో కాంగ్రెస్ లో కీలక నేతలుగా ఉండి.. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి సొంత గూటికి రాబోతున్నారని సమాచారం.  ఇప్పటికే కొందరు నేతలు రేవంత్ రెడ్డితో మాట్లాడారని, త్వరలో అధికారికంగా చేరబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీ పని చేసి బీజేపీలో చేరిన నేతలంతా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ లో పని చేసేందుకు ముందుకు వస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

వలసలతో పాటు ఓ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనం కావచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక నేత, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే యోచనలో ఉన్నారని సమాచారం. టీజేఎస్ విలీనంపై ఇప్పటికే రేవంత్ రెడ్డితో కోదండరామ్ మాట్లాడారని చెబుతున్నారు. టీజేఎస్ విలీనంపై క్లారిటీగా ఉన్నందునే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లో చేరాలని కోదండరామ్ సూచించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేసిన తర్వాత.. అతనితో పలు సార్లు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈటలతో ఈ ఇద్దరు నేతలు చర్చలు జరిపారని, కాంగ్రెస్ లో చేరాలని సూచించారని చెబుతున్నారు. 

టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. గత ఏడేండ్లుగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ లో  కొత్త ఉత్సాహం కనబడ్డది. రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతోపాటు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఢీకొట్టగల సమర్థుడిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చెల్లాచెదరైన కేసిఆర్ వ్యతిరేకులంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ అయ్యే వాతావరణం కనబడుతున్నది. తెలంగాణ  జన సమితి పార్టీ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. కోదండరాం వ్యక్తిగతంగా ఉన్నతమైన వ్యక్తిగా జనాల్లో గుర్తింపు ఉన్నా.. రాజకీయా లు నడపాలంటే ఆయనకు  సరైన వ్యూహం లేదని అంటున్నారు. అందుకే  ఆయనే పోటీ చేసినా పట్టభద్రుల ఎమ్మల్సీగా ఓటమిపాలయ్యారు. ఇక పార్టీని నడిపించడం సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చిన కోదండరామ్..  పార్టీని వదిలించుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

కోదండరాంతో రేవంత్ కొంతకాలంగా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు పిసిసి వస్తే జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయాలని రేవంత్ కోరినట్లు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఈవిషయమై చర్చలు కూడా సాగినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో జన సమితిని విలీనం చేద్దామనే ప్రతిపాదన ఇటీవల కోదండరాం నుంచి వచ్చినట్లు జన సమితి నేతల్లో టాక్ నడుస్తోంది. కుదిరితే కాంగ్రెస్ తో పొత్తు, లేదంటే విలీనం అనేదిశగా వారు సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వయంగా ఆయన కోదండరాం ను కలిసి ఓపెన్ గానే విలీనం చేయాలని అభ్యర్థించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోవచ్చని టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.