హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్!

Publish Date:Jun 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది.  . గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా  వార్తల్లో నిలిచారు.   ఐదేళ్ల కిందటి ఒక   వివాదంలో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  2021 ఫిబ్రవరి నాటి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో..  అప్పటి వైసీపీ ప్రభుత్వంలో  పౌరసరఫరాల శాఖ మంత్రిగా  ఉన్న కొడాలి నాని..  గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచార పర్వంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించేలా ఆయన మాట్లాడారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా..  రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కించపరిచేలా  ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు, స్థానిక పోలీసులు గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై  కేసు నమోదు చేశారు.

అయితే..  2021లో కేసు దర్యాప్తు పూర్తయినప్పటికీ..  కొడాలి నాని అప్పట్లో మంత్రిగా ఉండటంతో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమైంది. ముందస్తు అనుమతి కోసం పంపిన ఆ ఫైల్, వైసీపీ హయాంలో ఎలాంటి  కదలికా లేకుండా హోంశాఖలోనే పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో ఈ కేసు విచారణకు బ్రేక్ పడింది. కానీ..  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.  తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుుడు..  2021 నాటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కొడాలి నానిపై ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నట్లు నిర్ధారించి..  తక్షణ చర్యలకు ఆదేశించడంతో, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్  మాజీ మంత్రి కొడాలి నానిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి అనుమతినిస్తూ అధికారికంగా ఉత్తర్వులు   జారీ చేశారు.  

ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ రావడంతో కొడాలి నానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన మాజీ మంత్రి నాని, తక్షణ ఉపశమనం కోసం హైకోర్టును  ఆశ్రయించారు. హోంశాఖ జారీ చేసిన ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ..  తనపై నమోదైన పాత కేసును పూర్తిగా కొట్టివేయాలని  కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా ఇదే తరహా అంశంపై తాను న్యాయస్థానం నుండి కొన్ని ఉపశమనాలు పొందిన విషయాన్ని నాని తన పిటిషన్‌లో  ప్రస్తావించినట్లు తెలుస్తోంది.   ఈ క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఎప్పుడు విచారణ జరుపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
ఈ నెల 25న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
హైదరాబాద్‌లో మరోసారి ఖాకీపై అవినీతి మచ్చ పడింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK) మరియు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే (DMK) నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.