మణిపూర్ హింసాకాండ.. నాకేం సంబంధం విలేకరులపై కిషన్ రెడ్డి అసహనం

Publish Date:Jul 22, 2023

Advertisement

మణిపూర్ లో హింసాకాండపై బీజేపీ వైఖరి ఎలా ఉందన్నది కిషన్ రెడ్డి తన అసహనం ద్వారా తేటతెల్లం చేశారు. నెలల తరబడి ఆ రాష్ట్రం హింసాజ్వాలలో తగలడిపోతున్నా.. ఇంత వరకూ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించలేదు. అదేదో దేశానికి సంబంధించిన సమస్య కాదన్నట్లుగా వదిలేశారు. ఆ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోని వచ్చి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమైన తరువాత, అదీ సుప్రీం కోర్టు స్వయంగా మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని వివరణ కోరిన తరువాత మోడీ నోరు విప్పి ఆ అమానవీయ ఘటనను ఖండించారు.

అయితే మణిపూర్ లో హింసాకాండను అరికట్టే విషయంలో అటు కేంద్రం ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. శాంతి  భద్రతల సమస్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుంటే.. చేతులెత్తేసిన మణిపూర్ ప్రభుత్వం జరిగేది జరుగుతూనే ఉంటుందన్నట్లు మిన్నకుండిపోయింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మణిపూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతుంటే.. ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధపడకుండా సభను వాయిదా వేసి పారిపోతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మణిపూర్ విషయం తనకేం సంబంధం లేదని మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. బీజేపీ ఏమైనా తెలంగాణకు చెందిన ప్రాంతీయ పార్టీయా అని నిలదీస్తున్నారు.

సోమవారం (జూలై 24) లోక్ సభలో మణిపూర్ హింసాకాండపై చర్చ జరిగితే తెలంగాణ గడ్డపై నుంచి కిషన్ రెడ్డి చెప్పిన విధంగానే లోక్ సభలో కూడా ప్రభుత్వం అది తనకు సంబంధం లేని విషయం అని చెప్పగలుగుతుందా? మణిపూర్ భారత్ లో అంతర్భాగమే కదా? మరి అటువంటప్పుడు నెలల తరబడి ఆ రాష్ట్రంలో హింసాకాండ రాజ్యమేలుతుంటే.. జాతుల మధ్య ఘర్షణలో వందల సంఖ్యలో జనం నేలరాలుతుంటే కేంద్రానికి బాధ్యత లేదా? మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా కార్యాచరణ రూపొందించకుండా మౌనం వహించడమేంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.