తెలంగాణ‌ తెలుగుదేశంలో నయాజోష్.. బడా నేతల చేరికకు చంద్రబాబు గ్రీన్‌సిగ్న‌ల్‌

Publish Date:Jul 15, 2024

Advertisement

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి పూర్వ‌వైభ‌వం రాబోతుందా.. తెలుగుదేశం  అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెట్టారా?  ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌నేత‌లు తెలుగేదేశంలో చేరేందుకు చంద్ర‌బాబుతో మంత‌నాలు జ‌రిపారా?  అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అంటే అవుననే స‌మాధానమే వస్తోంది.  తెలంగాణ‌లో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌టంతో పాటు, గ‌త అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం పోటీ చేయ‌క‌పోవ‌టంతో ఆ పార్టీ క్యాడ‌ర్ ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.  గ‌తంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్య‌నేత‌లంతా బీఆర్ఎస్ లో చేర‌గా.. కొంద‌రు కాంగ్రెస్ లో చేరారు. అయితే, వారిలో చాలా మంది మ‌ళ్లీ తెలుగుదేశం గూటికి తిరిగి వచ్చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్య‌నేత‌లుగా చ‌లామ‌ణిలో ఉన్న ఇద్ద‌రు నేత‌లు త్వ‌ర‌లో  తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వారు చంద్ర‌బాబుతో మంత‌నాలు జ‌రిపార‌ని, వీరిలో ఒక‌రు తెలంగాణతెలుగుదేశం అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నార‌న్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం సుదీర్ఘ రాజ‌కీయ‌ అనుభ‌వం క‌లిగిన చాలా మంది నేత‌లు తెలుగుదేశం ద్వారా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌వారే. వారిలో కొంద‌రు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోనూ, ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనూ మంత్రులుగా కొన‌సాగుతున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు త‌రువాత చంద్ర‌బాబు నాయుడు ఏపీ రాజ‌కీయాల‌పై ఎక్కువ కాన్ సన్ ట్రేట్ చేయడంతో తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌ల‌హీనప‌డుతూ వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీలో ముఖ్య‌నేత‌లు అధిక‌శాతం మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో తెలంగాణ‌ తెలుగుదేశం  నాయ‌క‌త్వ లేమితో ఎన్నిక‌ల్లోసైతం అభ్య‌ర్థుల‌ను పోటీకి నిల‌బెట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ.. దానిని స‌ద్వినియోగం చేసుకొని పార్టీని బ‌లోపేతంచేసే నాయ‌కుడు లేని పరిస్థితి ఏర్పడింది.   ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవ‌డంతో ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇష్ట‌ప‌డ‌ని నేత‌లు తెలుగుదేశం వైపు చూస్తున్నారు.  

బీఆర్ఎస్  అధికారంలో ఉన్న స‌మ‌యంలో మంత్రిగా ప‌నిచేసి , ఇటీవల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ నుంచి విజ‌యం సాధించిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి  తెలుగుదేశం గూటికి చేరడం ఇక లాంఛనమే అని అంటున్నారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  తెలుగుదేశం తరఫున మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి లోక్ సభకు ఎన్నికయ్యారు.  ఆ త‌రువాత బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగానూ ప‌నిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం, ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో మ‌ల్లారెడ్డి ఒరింత ఇబ్బందిరన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో మ‌ల్లారెడ్డి, రేవంత్ రెడ్డికి మ‌ధ్య భూక‌బ్జాల విష‌యంలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జ‌రిగింది. మ‌ల్లారెడ్డి వంద‌ల కోట్ల విలువైన భూముల‌ను క‌బ్జా చేశార‌ని అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ సీఎం అయిన త‌రువాత మ‌ల్లారెడ్డి క‌ళాశాల‌కు చెందిన భ‌వ‌నం ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించుకొని నిర్మాణం చేశారంటూ కూల్చివేశారు.

ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే దాడిని త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిద్ధ‌ప‌డిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే, మ‌ల్లారెడ్డి రాక‌ను కాంగ్రెస్ లో కొంద‌రు వ్య‌తిరేకించ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరిక నిలిచిపోయింది. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా బ‌లోపేతం అయ్యేందుకు, తెలంగాణ‌ ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే ఇబ్బందిని త‌ట్టుకోవాలంటే తెలుగుదేశంలో చేర‌డ‌మే మంచిద‌న్న భావ‌న‌కు మ‌ల్లారెడ్డి వ‌చ్చిన‌ట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలోనూ కీల‌కంగా ఉన్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు అండ‌దండ‌లు ఉంటే తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా ఇబ్బంది ఉండ‌ద‌ని మ‌ల్లారెడ్డి, ఆయ‌న వ‌ర్గీయులు భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశంలో చేరి రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు మ‌ల్లారెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని, అందుకు చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా వ‌చ్చిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గాఉన్న నామా నాగేశ్వ‌ర‌రావు కూడా తెలుగుదేశం గూటికి చేర‌బోతున్న‌ట్లు కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.  2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్ లో చేరిన నామా.. ఆ ఎన్నికలలో ఎంపీగా విజ‌యం సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీఆర్ఎస్  త‌ర‌పున పోటీచేసి ఓట‌మి పాల‌య్యారు. నామాకు తెలుగుదేశంతోనూ, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో సుదీర్ఘ‌కాలం ఆయ‌న  తెలుగుదేశంలో  ఉన్నారు. ఖ‌మ్మం జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ లో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన నామా..  తెలుగుదేశం గూటికి చేరేందుకు   సిద్ధ‌మ‌య్యార‌ని, ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో మంత‌నాలు కూడా జ‌రిపిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంలో చేరి.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించొచ్చని నామా ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌ల్లారెడ్డి, నామాలు సైకిల్ సవారీ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. వారిద్ద‌రూ తెలుగుదేశం పార్టీలో చేరితే రాష్ట్రంలో టీడీపీ పూర్వ‌వైభ‌వం సంతరించుకోవడం ఖాయమన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.