Publish Date:Sep 12, 2024
సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఎట్టకేలకు వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తొలుత మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి మద్దతూలేదని, తనకు భయమేస్తోందని చెప్పిన ఆ మహిళ ఈ తరువాత వైద్య పరీక్షలకు నిరాకరించారు. దీంతో ఆమెకు బెదరింపులు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని బదనాం చేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని మండిపడుతూ, ఆ మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేశారు.
ఇక తాజాగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యి పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బంధువులు, గన్ మెన్లు ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డిఎస్పి కనజక్షన్ నేతృత్వంలో విచారించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు తపపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం (సెప్టెంబర్ 9)క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి దర్యాప్తూ చేయకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆదిమూలం పిటిషన్ లో పేర్కొన్నారు.
అదలా ఉండగా ఇంత కాలం వైద్యపరీక్షలకు నిరాకరించిన బాధితురాలు ఆదిమూలం క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. ఇక ఆ వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఇలా ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం తరఫుర న్యాయవాది శేషకుమారి వాదించనుండగా, ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా వరలక్ష్మి వాదించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/key-developement-in-mla-adimulam-case-25-184647.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.