కేశినేని స్వరం మారిందా.. తత్వం బోధపడిందా?

Publish Date:Sep 8, 2023

Advertisement

విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఏం మాట్లాడినా ముక్కుసూటిగా ఉంటుందంటారు. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన రాజకీయవేత్త అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా బెజవాడ రాజకీయాలలో ఆయన ఆధిపత్యం తిరుగులేనిది. అందుకు ఆయన గత ఎన్నికలలో విజయవాడ నుంచి ఎంపీగా ఎన్నిక కావడమే అంటారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో  అత్యధిక అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించినా.. లోక్ సభ సభ్యుడిగా కేశినేని నాని గెలవడమే బెజవాడలో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెబుతారు.

అటువంటి నాని ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోందన్న బెంగలో పడ్డారు. అసలు ఆయన రాజకీయాలలోకి రావడమే కాకతాళీయం అంటారు ఆయన ప్రస్థానం గురించి తెలిసిన వారు. అసలు నాని రాజకీయ నాయకుడు కాదు.. సినిమా హీరో కావాల్సిన వారు. తొలుత ఆయన తన భవిష్యత్ కు, ఎదుగుదలకు సినీ హీరోగా కెరీర్ ప్రారంభించాలని భావించారు. ఇందు కోసం ఆయన దర్శక రత్న దాసరి వద్దకు వెళ్లారు. దాసరి అప్పట్లో కొత్త నటీనటులతో ఓ సినిమా తీసే యోచనలో ఉన్నారు. అందులో ఇద్దరు హీరోలలో ఒకరిగా నానికి దాదాపు చాన్స్ ఇచ్చేశారు. అయితే అప్పట్లో కేశినేని నానితో పోటీ పడి చివరి నిముషంలో కేశినేని నాని అవకాశాన్ని తన్నుకు పోయిన వ్యక్తి కలెక్షన్ కింగ్ గా విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు. ఔను అప్పటిలో చివరి క్షణంలో సినీమా హీరోగా అవకాశం తప్పిపోవడంతో కేశినేని నాని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కేశినేని ట్రావెల్స్ స్థాపించి రవాణా రంగంలో రాణించారు.

అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా ఎదిగారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కెరీర్ లో ఏరీ ఆయన చాయిస్ కాదు.. చాన్స్ అంతే. రాజకీయంగా తన ఎదుగుదలకు దోహదపడిన తెలుగుదేశంతో గత కొంత కాలంగా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలై విపక్ష పాత్రకు పరిమితమైన నాటి నుంచీ  అధికార వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా నాని తీరు ఉంది.  పార్టీలోని కొందరు నాయకులతో తన కున్న విభేదాలను అడ్డుపెట్టుకుని తన స్థాయిని మరిచి మరీ  సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించి ఉద్దేశపూర్వకంగా పార్టీకి దూరం అవుతున్న సంకేతాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ  కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలపై పొగడ్తల వర్షం కురిపించి ఇక తెలుగుదేశం పార్టీ కూడా తనను లెక్కలోంచి తీసేసే పరిస్థితిని స్వయంగా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని వైసీపీ గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే నిర్ణయానికి వచ్చేసి కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో   విజయవాడ లోకసభ స్థానం నుంచి కేశినేని చిన్నిని పార్టీ అభ్యర్థిగా నిలపాలన్న నిర్ణయానికి వచ్చేసింది.  దీంతో బెజవాడ బరి అన్నదమ్ముల సవాల్ గా మారనున్నదన్న భావన సర్వత్రా కలిగింది. అయితే వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించారో ఏమో కానీ కేశినేని నాని తన ప్రయాణం తెలుగుదేశంతోనే అని పదే పదే చెబుతూ పార్టీ అధిష్ఠానం మెప్పు పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే  ఆయన పదే పదే తాను విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రానున్న ఎన్నికలలో నిలబడతానని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హస్తినలో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించిన సంగతిని మరిచిపోయి ఆయన వంటి దార్శనికుడు, నిజాయితీ పరుడు లేడంటూ కీర్తిస్తున్నారు. తాజాగా కంచికచర్లలోని ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కు హాజరైన కేశినేని నాని మరోసారి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి నిజాయితీ పరుడు లేడన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయాలలో మచ్చ లేని వ్యక్తిగా చంద్రబాబుది స్వచ్ఛమైన వ్యక్తిత్వమన్నారు.

ఇంతకీ అంత చేసిన కేశినేని నాని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం విశ్వాసాన్ని పొందగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు కు ఐటీ నోటీసులపై స్పందించిన కేశినేని నాని నోటీసులు పెద్ద విషయం కాదన్నారు. వివరణ ఇస్తే సరిపోతుందనీ దానిపై అనవసర ఊహాగానాలు వ్యర్థమని వైసీపీకి చురకలంటించారు. అక్కడితో ఆగకుండా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఉంటాననీ చెబుతూ వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తానే బరిలో ఉంటానన్నారు.  ఇక ఏపీలో పొత్తులపై చర్చ గురించి మాట్లాడుతూ పొత్తుల విషయం పూర్తిగా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయమేననీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే క్యాడర్ అంతా దానికి కట్టుబడి ఉంటుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలనీ, తాను పార్టీలోనే పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.