కేసీఆర్ బావమరిది కన్నుమూత..!

Publish Date:Aug 13, 2026

Advertisement

 

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కొంపల్లికి సమీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్న అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్ రావు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

శ్రీనివాస్ రావు మృతితో కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స్వయాన మేనమామ. మేనమామ మృతి వార్త తెలియడంతో కేటీఆర్ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

శ్రీనివాస్ రావు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు హరీశ్ రావు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతితో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

KCRs brother-in-law passes away, Joginapalli Srinivas Rao, KTR, BRS Party, Yashoda Hospital, 
Harish Rao, Kavitha 

By
en-us Political News

  
హర్మూజ్ జలసంధిలో అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్ ఆ పోస్టులో విస్పష్టంగా పేర్కొన్నారు,  అక్కడ సముద్ర మార్గంలో ఇరాన్  గతంలో అమర్చిన   మైన్‌ లు అన్నింటినీ అమెరికా బలగాలు పూర్తిగా తొలగించాయని ట్రంప్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం అనంతరం అదే రోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచే నేరుగా లండన్  బయలుదేరతారు.
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.