Publish Date:Jul 16, 2024
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసిహారెడ్డి ఛైర్మన్ గా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు.
కేసీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసీఆర్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అనకుండా... ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని తెలిపింది.
మరోవైపు, కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, కమిషన్ ఛైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ఛైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని... సోమవారం కొత్త ఛైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే హైకోర్టులో కెసీఆర్ కు చుక్కెదురైంది. కమిషన్ రద్దు చేయాలని కెసీఆర్ వేసిన పిటిషన్ కొట్టి వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-will-be-thrown-in-the-supreme-court-25-180863.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.