ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం.. ఆహంకారమా? .. కుంగుబాటా?

Publish Date:Aug 20, 2024

Advertisement

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం బీఆర్ఎస్ కు మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేతకు భారీ షాక్ అనే చెప్పాలి. తెలంగాణలో తన మాటకు తిరుగులేదు అన్న రీతిలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన నోటి మాటతో, కను సైగతో శాశించిన కేసీఆర్ ఆ ఓటమి తరువాత సైలెంటైపోయారు. ఒక వేళ అయనా మాట్లాడినా పట్టించుకునే వారూ, లెక్క చేసే వారూ లేకుండా పోయారు. పార్టీ ఎమ్మెల్యేలను గంటల తరబడి  ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) గేట్ల మందు పడిగాపులు పడేలా చేసిన కేసీఆర్ కు ఇప్పుడు పిలిచినా సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు ద్వితీయ శ్రేణి నేతలూ అందుబాటులోకి రాని పరిస్థితి ఎదురైంది. 

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకున్న కేసీఆర్ తనను తాను సర్వశక్తిమంతుడిగా ఊహించుకున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను నిర్వీర్యం చేసేయడంతో రాష్ట్రంలో ఇక తనకు తిరుగేలేదన్న భావనకు వచ్చారు. 

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు దిమ్మదిరిగేలా చేసింది. ఎందుకంటే.. రాష్ట్రంలో తమకు బీజేపీ నుంచి మాత్రమే నామమాత్రపు పోటీ ఉంటుందని, రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ లకు అసలు చోటే లేదని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్ పట్ల, ఆ పార్టీ నేతల పట్ల చాలా చులకన భావన వ్యక్తం చేశారు. అటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కకపోవడంతో కేసీఆర్ డీలా పడిపోయారు. దీనికి తోడు తాను తానా అంటే తందానా అనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పంచన చేరారు. ఇంకా పలువురు అదే బాట పట్టే అవకాశాలున్నాయనీ, బీఆర్ఎస్ ఇప్పుడో అప్పుడో బీజేపీలో వినీలమైపోతుందన్న చర్చ కూడా తెలంగాణలో జోరుగా సాగుతోంది.  

ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేడర్ లో ధైర్యం, స్థైర్యం నింపాల్సిన కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమి తమైపోయారు. కేవలం ఒక్కటంటే ఒక్క రోజు మినహాయిస్తే ఆయన అసెంబ్లీకి కూడా గైర్హాజరయ్యారు.  పార్టీ పరాజయం తరువాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఓ మూడు నాలుగు సార్లు మినహా ఆయన బహిరంగంగా కనిపించింది లేదు. ఇక్కడే పరిశీలకులలోనూ, పార్టీ నేతలు, శ్రేణులలోనూ కేసీఆర్ ది అహంకారమా, కుంగుబాటా అన్న అనుమానాలు వ్యక్తం ఔతున్నాయి. కేసీఆర్ సహజంగా దూకుడుగా వ్యవహరించే రాజకీయ వేత్త. కానీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి పాలై తాను ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితమైన తరువాత ఆయన చాలా వరకూ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు.  
అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన బయటకు వచ్చి సభలలో మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మాత్రమే ఆయన ప్రజా సమూహంలోకి వచ్చి గళం వినిపించారు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో పెర్ఫార్మెన్స్ తరువాత ఆయన మరీ నల్లపూసై పోయారు. తెలంగాణ పితగా తాను రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలిస్తానని భావించేవారు. విపక్ష నేతలెవరూ తన కాలిగోటికి కూడా సరితూగరని భావించేవారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఆయన చాలా చులకనగా చూసేవారు. ముఖ్యమంత్రిగా తాను అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమత్రి. కేసీఆర్ అహంకారపు కోట గోడల్ని బద్దలు కొట్టిన నాయకుడు.  ఇప్పుడు కేసీఆర్ మౌనానికీ, ప్రజా జీవితానికి దూరంగా ఉండడానికీ అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కారణమేదైతేనేం కేసీఆర్ క్రియాశీలంగా లేకపోవడం బీఆర్ఎస్ ను మరింత బలహీన పరుస్తోంది. కేటీఆర్, హరీష్రావు ఎంత ప్రయత్నించినా కేసీఆర్ క్రియాశీలంగా లేని లోటును పూడ్చ లేకపో తున్నారు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, డిఫాక్టో సీఎంగా అత్యంత ప్రభావమంతంగా, శక్తిమంతంగా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు తేలిపోతున్నారు. హరీష్ రావు పరిస్థితి కూడా దాదాపు అంతే.

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ట్రబుల్ షూటర్ గా చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు స్వయంగా ఇబ్బం దుల్లో కూరుకు పోతున్నారు.  ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ మాత్రంగానైనా నిలదొక్కుకోవాలన్నా, ప్రజా క్షేత్రంలో బలోపేతం కావాలన్న కేసీఆర్ తన మౌనం వీడి జనంలోకి రావాలి. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించకపోవడానికి కారణం ఏమిటన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు అయితే  కేసీఆర్ మౌనానికి, ముఖం చాటేయడానికి  కారణం అయితే అహంకార లేకుంటే కుంగుబాటు అని విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.