Publish Date:May 11, 2022
కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ మరో వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణలో నియోజకవర్గాలను పెంచాలని గళమెత్తాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఉంది. దీని కోసం గతంలో కేసీఆర్ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మిన్నకున్నారు.
అయితే ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఆ ఆంశాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందు కోసం కేంద్రంపై లేఖాస్త్రాలు సంధించాలని యోచిస్తున్నారు. ఇప్పుడింత హఠాత్తుగా నియోజకవర్గాల పెంపు విషయం కేసీఆర్ఎందుకు లేవనెత్తుతున్నారు. కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ డిమాండ్ ను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదని తెలిసినా కేసీఆర్ నియోజకవర్గాల పెంపుపై పట్టుబడుతున్నారు.
ఎందుకంటే ఇటీవలే కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా చేసి నియోజకవర్గాల డీ లిమిటేషన్ కూడా పూర్తి చేసేసింది. దానికి ఆమోద ముద్ర వేసి ఎన్నికలు జరిపించడమే తరువాయి. అక్కడ ఆఘమేఘాల మీద చేసేశారు, తెలుగు రాష్ట్రాలవిభజన జరిగి ఎనిమిదేళ్లయినా, విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశం స్పష్టంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని చేయరని ప్రశ్నిస్తూ కేంద్రంపై లేఖాస్త్రాలను ప్రయోగించడం ద్వారా మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
కేసీఆర్ డిమాండ్ పై కేంద్రం స్పందించినా, స్పందించకున్నా.. నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావిండం ద్వారా తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందన్నదే కేసీఆర్ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు అంశంపై గతంలో కూడా రెండు రాష్ట్రాలూ డిమాండ్ చేశాయి. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గాల పెంపు కోసం అప్పటికి మిత్రపక్షమైన బీజేపీతో పెద్ద యుద్ధమే చేశారు. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాల పెంపు జరగాల్సిందేనని పట్టుబట్టారు.
అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాలను పెంచాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అప్పట్లో కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం మెల్లిమెల్లిగా మరుగున పడింది. ఇప్పుడు కాశ్మీర్ లో నియోజకవర్గాల డీ లిమిటేషన్ తో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-raises-assembly-seats-hike-issue-25-135717.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.