Publish Date:Aug 17, 2024
కేసీఆర్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్, గత 12 రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని ఫామ్‌హౌస్‌లోనే వున్నారు. యశోద హాస్పిటల్ బృందం ఫామ్‌హౌస్‌లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పి కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌కి అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు నాలుగు రోజుల క్రితం ప్రత్యేక అంబులెన్స్.లో ఫాంహౌస్‌కి తీసుకువచ్చారు. తనని ఆస్పత్రిలో చేర్చితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకుంటుందని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులను కేసీఆర్ వారించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోకసభలో సున్నా స్థానాలు రావడం, ఐదు నెలలుగా కూతురు కవిత తీహార్ జైల్లో ఉండడం, కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనలతో కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందారని తెలుస్తోంది. పార్టీని నడిపించే శక్తి లేని కేటీఆర్, తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు... దాంతో పార్టీనీ నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో వున్నాయి. కేసీఆర్ అస్వస్థత విషయం ముఖ్యంగా ఎమ్మెల్యేలకి విషయం తెలియకూడదని, తెలిస్తే వాళ్ళు పార్టీ మారిపోయే ప్రమాదం వుందని ఎమ్మెల్యేలని విదేశీ పర్యటనకి తీసుకువెళ్లారని సమాచారం. కేసీఆర్ తీవ్ర అస్వస్థత విషయం తెలిసిన కొందరు నాయకులు , హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-ill-health-25-183138.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.