Publish Date:May 25, 2022
తెలంగాణలో రైతు సంక్షేమం అద్భుతంగా ఉందని ఒక వైపు తెరాస సర్కార్ భుజాలు చరుచుకుంటుంటే.. మరో వైపు రైతు ఆత్మహత్యల సంగతేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీరే మార్గం కానరాక, రైతు బంధు, రుణమాఫీలు అక్కరకు రాక తెలంగాణలో రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు.
ఒక్క సోమవారం రోజే రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లాలో ఒకరు, వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున పురుగుల మందు తాగి తనువు చాలించారు. రైతు సంక్షేమం అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలేనా అన్న అనుమానం కలిగేలా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రైతుల కడగండ్లు పట్టించుకోకుండా పంజాబ్ రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రజల సొమ్ముకు కేసీఆర్ పందేరం చేయడాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి.
ముందు స్వరాష్ట్రంలో రైతుల కష్టాలు కడతేర్చిన తరువాత ఇతర రాష్ట్రాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో వ్యక్తిగత గుర్తింపు కోసం రాష్ట్ర ప్రజల సొమ్ము పందేరం చేసే అధికారం ఎవరిచ్చారంటూ నిలదీస్తున్నారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఇచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన రైతు బానోతు హరి, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కల పల్లికి చెందిన భూక్యా రాజు, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన జునుమాల కొమరయ్యలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అప్పులు తీరే మార్గం కానరాకపోవడమే. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వల్లనే.
రైతు శ్రేయస్సే తెరాస సర్కార్ ధ్యేయం లక్ష్యం అంటే పదే పదే వల్లెవేసే కేసీఆర్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకుండా,ఇరత రాష్ట్రాలలో రైతులకు ఆర్థిక సహాయం అంటూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం పట్ల రాష్ట్ర రైతాంగంలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-ignore-farmer-problems-in-state-25-136396.html
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.