గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ బీఆర్ఎస్ అధినేత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన క్రీయాశీలంగా లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బలహీనపడింది. ఆ పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది. అయితే కేసీఆర్ అధికారంలో ఉండగా వాగ్దానాలను ఏ మేరకు నిలబెట్టుకున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అయితే గత ఎన్నికలకు ముందు ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఉంటా... ఓడితే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని విస్పష్టంగా చెప్పారు. ఆ మాటకే కట్టుబడి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అధికారంలో ఉంటేనే ప్రజా జీవితంలో ఉంటాననీ, లేకుంటే రెస్టు తీసుకుంటాననీ ఆయన ఎన్నికలకు ముందే విస్పష్టంగా చెప్పేశారు. ఆ మాట మీదే నిలబడ్డారు. నిలబడుతున్నారు. ఇందులో ఆయనను తప్పుపట్టాల్సిన పని లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావం తరువాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆయా ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తాను అన్న హామీ నుంచి భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి వరకూ ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే వాటి అమలును ఎన్నడూ పట్టించుకోలేదు. మాట ఇవ్వడం, మాట తప్పడం కేసీఆర్ కు అలవాటే అన్న భావన తెలంగాణ సమాజంలో పాతుకుపోయింది.
అలా కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడతాను అని నిరూపించాలని కేసీఆర్ భావించారో ఏమో.. పార్టీ ఓటమి తరువాత ఆయన చెప్పిన విధంగా ఫామ్ హౌస్ కే పరిమితమై రెస్టు తీసుకుంటున్నారు. గత 13 నెలలుగా రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ వానప్రస్థంలో గడుపుతున్నట్లు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రత్యేక తెలంగాణా డిమాండును నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశన సందర్భంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. నిజానికి మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్ రెండేళ్ళు కార్మిక మంత్రిగా పని చేశారు. అందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై సంతాప తీర్మానంపై మాట్లాడతారని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి బయటకు రాలేదు.
కేసీఆర్ తీరు కారణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ చీలికలు పేలికలుగా మారిపోయే పరిస్ధితిలో ఉంది. కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్యా పార్టీ పగ్గాల కోసం అంతర్గత పోరు జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్యాడర్ అయితే కేటీఆర్, కవితల మధ్య నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మొత్తం మీద అధికారంలో ఉండగా సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. అధికారం పోయిన తరువాత రాష్ట్రాన్ని, ప్రజలను, చివరకు పార్టీనీ కూడా పట్టించుకోకుండా మౌనంగా ఉండటం ఆయన ప్రతిష్టను మసకబారుస్తోందనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-confine-to-farm-house-25-190743.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.