Publish Date:Apr 30, 2022
టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అన్నట్లుగా బిజెపి ఇటు టిఆర్ఎస్ ని, అటు కాంగ్రెస్ ని ఒకే సారి టార్గెట్ చేసిందని గ్రహించారేమో.. సిఎం కెసిఆర్ తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశారు. ప్రశాంత్ కిషోర్ భుజాలపై తుపాకి పెట్టి టిఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను రెండింటిని ఏకకాలంలో లక్ష్యం చేసింది బిజెపి. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే.. రాష్ట్ర రాజకీయాలలో తమ ఆధిపత్యానికి గండి పడే అవకాశాలు ఉన్నాయన్న బావనతోనే తెురాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన వ్యూహాన్ని మార్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ వ్యూహం గ్రహింపునకు రానంత కాలం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలగాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచించి, ఆ దిశగా అడుగులు వేసిన కేసీఆర్.. బీజేపీ ఎత్తుగడ గ్రహించిన మరుక్షణమే తన వ్యూహాలను మార్చుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ముందుకు సాగితే.. తెలంగాణలో టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అంచనాకు కేసీఆర్ రావడంతోనే...దిశ మార్చుకుని, వ్యూహాలను మార్చుకుని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చారన్నది పరిశీలకులు అభిప్రాయం.
2018 ఎన్నికల్లో తెరాసకు అప్పటి రాజకీయ సమీకరణాలు బాగా కలిసి వచ్చాయి. అదును చూసి ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ఆశించిన దాని కన్నా ఎక్కువగా ప్రయోజనం పొందారు. అందుకుకారణం అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే. కాంగ్రెస్, తెలుగుదేశంల పొత్తు కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. ఆయాచితంగా మరోసారి సెంటిమెంట్ అనే బలమైన ఆయుధాన్ని ఆయన చేతికి ఇచ్చింది.
మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి వస్తున్నాయంటూ ప్రచారంతో ఊరూవాడా ఏకం చేసేశారు. మరోసారి తెలంగాణ ఉద్యమం నాటి స్థాయిలో సెంటిమెంటును రగిల్చారు. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి.
ఇప్పుడు అలాంటి అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకునేందుకు ప్రశాంత్ కిశోర్ రూపంలో అవకాశం వచ్చింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏక కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోనూ, తెలంగాణలో కేసీఆర్ తోనూ చర్చలు జరపడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కలిసిపోతున్నాయన్న ప్రచారానికి బీజేపీ తెరతీసింది. 2018 ఎన్నికలలో తెరాస ఎలాగైతే కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తును ఉపయోగించుకుని ఎలా రాజకీయ లబ్ధి పొందిందో...సరిగ్గా అలాగే కాంగ్రెస్, తెరాస ములాఖత్ పేరుతో బీజేపీ లబ్ధి పొందేందుకు ఉపయోగించుకోవాలనుకుంది. ఈ ఎత్తుగడను సకాలంలో పసిగట్టిన కేసీఆర్ ఒక్క సారిగా తన వ్యూహాలను మార్చేసి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. సరే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు పీకే కాంగ్రెస్ చేరికకు ఆదిలోనే హంస పాదు పడింది. దీంతో పీకే వ్యూహాలను రాష్ట్రంలో అనుసరించడానికి కేసీఆర్ కు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు అవ్వని పరిస్థితి వచ్చింది. అయితే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కోరికను మాత్రం కేసీఆర్ మరోసారి పక్కన పెట్టక తప్పని రాజకీయ అనివార్యతను బీజేపీ వ్యూహాత్మకంగా కల్పించింది. అందుకే జాతీయ అజెండాకే పరిమితమై.. మారిన తన వ్యూహాన్ని ఇటీవల ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఆవిష్కరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-changes-stratagy-keep-aside-naional-politcs-39-135242.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.