కవిత రూటేంటి? మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ సంకేతమేంటి?

Publish Date:Jun 14, 2025

Advertisement

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూటేంటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. నిన్నటి వరకూ బీఆర్ఎస్ లో దయ్యాలు చేరాయంటూ, సొంత అన్న టార్గెట్ గా విమర్శలు గుప్పించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తెలంగాణ జాగృతినే నమ్ముకుని రాజకీయంగా ఎదగడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకూ బీఆర్ఎస్ కు తాను దూరం అన్నట్లుగా వ్యవహరించిన కవిత ఇప్పుడు మాత్రం తాను బీఆర్ఎస్ నేతనే అని చెప్పుకునేందుకు నానా యాతనా పడుతున్నారు.

నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లో కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించనని విస్పష్టంగా ప్రకటించిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె7సిడెంట్ కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ అయిపోతున్నారు. కేసీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆమె ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కవిత.. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.  కేటీఆర్ కు ఏపీసబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తే.. కేటీఆర్ కు మద్దతుగా కవిత ఈ పోస్టు పెట్టారు. గతంలో కూడా కవిత కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించినా.. ఈ సారి ఖండన మాత్రం భిన్నంగా ఉంది. గతంలో కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన కవిత.. దాదాపుగా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా వ్యవహరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టిన సమయంలో కానీ, తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభ సమయంలో  కానీ ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇటీవల మీడియాతో చిట్ చాట్ అంటూ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కు పార్టీని నడపడం చాతకావడం లేదంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు.   కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నట్లుగా మాట్లాడారు.

ఇంత మాట్లాడిన ఆమె తన తండ్రి కేసీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకున్నారు. అయితే తాజాగా అంటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కేసీఆర్ ఆమెతో కనీసం మట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో తత్వం బోధపడిన కవిత.. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పుకోవడానికే ఇప్పుడు రూటు మార్చి అన్న కేటీఆర్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ, కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం లేదనీ చాటేందుకే  కేటీఆర్ ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించారని అంటున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.