Publish Date:Mar 23, 2024
సాధారణంగా ఈ డీ కేసులంటే రాజకీయనాయకులు భయపడుతుంటారు.ఈడీ కేసుల్లో ముఖ్యంగా మూడు విషయాలు వారిని భయకంపితులను చేస్తాయి. నెంబర్ వన్ ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం కోర్టు పర్మిషన్ లేకుండానే ఎంతటి వారినైనా అరెస్ట్ చేయవచ్చు. ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. నెంబర్ టూ ఈడీ కేసుల్లో ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం సాక్ష్యుల వాంగ్మూలాలు సేకరించి అరెస్ట్ చేయవచ్చు. ఒక వేళ తప్పు జరిగితే మాత్రం ఈడీ అధికారుల మీద ఎటువంటి చర్య ఉండదు.నెంబర్ త్రీ ఈడీ కేసుల్లో నిందితులను కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితులను చూసినట్టే చూస్తారు కానీ అరెస్ట్ చేసే ముందు నిబంధనలు పెద్దగా పాటించరు. వి ఐపి కర్టెసీ లేకుండానే కటకటాల్లో తోసేస్తారు. ఈ మూడు కారణాలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత బీపీ పెంచేలా చేసింది. కవితకు మునుపెన్నడూ లేని బీపీ రికార్డ్ నమోదైంది. సాధారణంగా 120 బై 80 ఉంటే నార్మల్ గా భావించాలి. కవిత అరెస్ట్ తర్వాత హై బీపీ వచ్చినట్లు కవిత న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కవిత అరెస్ట్ తర్వాత దిక్కులేని మనిషయ్యింది. వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న తన తండ్రి కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం కవిత బీపీ పెరగడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు. కవిత కొడుకు ఆర్యను చూడగానే ఎమోషనల్ అయి గట్టిగా పట్టుకుని ఏడ్చినట్టు కుటుంబసహ్యులు పేర్కొన్నారు. హైబీపీ కారణంగా జైలులో కవిత ఆధ్యాత్మిక పుస్తకమైన భగవద్గీత చదవడం ,సాత్వికాహారం, పండ్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే, కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్ ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-high-blood-pressure-is-another-petition-in-the-court-39-172607.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.