జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నేత పాదయాత్ర!!

Publish Date:Jan 26, 2019

Advertisement

 

కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా నుంచి వైఎస్‌ జగన్‌ వెంట నడిచిన తొలి నాయకుడు. ఇది నాలుగేళ్ల క్రితం మాట. ఇప్పుడు అంతా మారిపోయింది. 2014 ఎన్నికల సమయంలో జగన్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విష్ణు జనం మధ్యకు వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో శుక్రవారం పాదయాత్ర ప్రారంభించి కావలి వైసీపీలో వణుకు పుట్టించారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిది కాంగ్రెస్‌ కుటుంబం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే వీరాభిమానం. కాంగ్రెస్ హయాంలో అక్రమాస్తుల కేసులో జగన్‌ తొలిసారి అరెస్ట్‌ అయిన సందర్భంలో వైఎస్‌ కొడుకును అరెస్ట్‌ చేయడం అన్యాయం అని మాట్లాడిన తొలి నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి. జగన్‌ సొంత పార్టీ జెండాతో బయటకు వచ్చినప్పుడు జిల్లా నుంచి వైసీపీలో చేరిన తొలి నాయకుడు కూడా ఆయనే. అయితే గత ఎన్నికల్లో కావలి టికెట్‌ ఆశించినా దక్కకపోవడంతో పార్టీ మీద అభిమానంతో వైసీపీ అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలని ఆనాడే ఈయన కోరినట్లు, తప్పకుండా ఇస్తానని జగన్‌ తనకు మాట ఇచ్చినట్లు విష్ణు చెబుతూ వచ్చారు. అదే ఆశతో సంక్రాంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి టికెట్‌ విషయం జగన్ తో మాట్లాడారు. టికెట్ ఇవ్వడం కుదరదని జగన్‌ తేల్చి చెప్పడంతో వెనుతిరిగారు.
 
తను ఏ కుటుంబానికైతే వీరాభిమానిగా ఉన్నారో ఆ కుటుంబం నుంచే తనకు నిరాదరణ ఎదురుకావడంతో జగన్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ జనం మధ్యకు బయలుదేరారు. జగన్‌ తీరు నచ్చక పలువురు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే పార్టీలోనే ఉంటూ, జగన్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తీర్పు కోసం జనం మధ్యకు వెళ్లిన తొలి నాయకుడు విష్ణు కావడం విశేషం. పాదయాత్ర ఆలోచనను విరమింపజేయాలని వైసీపీ అధిష్ఠానం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విష్ణు తన నిర్ణయం మార్చుకోలేదు. తన విషయంలో జగన్‌ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తేల్చుకోవడం కోసం జనం మధ్యకు బయలుదేరారు. శుక్రవారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
 
విష్ణువర్ధన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేమని జగన్‌ స్పష్టం చేసిన విషయం తెలుసు. రామిరెడ్డికే మళ్లీ టిక్కెట్టు ఇస్తారనీ తెలుసు. అధిష్ఠానం మాట కాదని ఆయన వెంట వెళ్లడం వల్ల సొంత పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుసు. వచ్చే ఎన్నికల్లో విష్ణు ఏ గుర్తుపై పోటీ చేస్తారో తెలియదు. అసలు పోటీ చేస్తారో లేదో గ్యారెంటీ లేదు. గెలుపు విషయంలో క్లారిటీ లేదు. అయినా.. విష్ణువర్ధన్‌రెడ్డి పాదయాత్రకు భారీ సంఖ్యలో జనం తరలిరావడం విశేషం. కావలితోపాటు ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కలిసిరావడంతో విష్ణు బలం మరింత పెరిగింది. వంటేరు వర్గం కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్రకు సంఘీభావం తెలుపడం విష్ణు డిమాండ్‌కు అదనపు బలం చేకూరింది.
 
విష్ణువర్ధన్‌రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో జనం రావడం, వారిలో అత్యధికులు వైసీపీ అభిమానులు కావడం ఆ పార్టీ అగ్రనేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజా మద్దతు కలిగిన నాయకుడు పార్టీకి దూరమైతే, లేక తిరుగుబాటు అభ్యర్థిగానో, మారో పార్టీ గుర్తుపైనో బరిలోకి దిగితే పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంపై పట్టున్న మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి కూడా విష్ణుతో జతకట్టడంతో వీరి కోరిక నెరవేరని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కావలితో పాటు పక్క నియోజకవర్గాల్లో సైతం వైసీపీకి నష్టం జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.