తెలంగాణకు కర్నాటక లింకేమిటి?

Publish Date:Apr 5, 2023

Advertisement

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. పరిశీలకుల విశ్లేషణల మేరకు ఆ రాష్ట్రంలో ఫలితాలు కచ్చితంగా ఆ తరువాత జరగబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం కనుక ఆ ప్రభావం ఉంటుందని కాదు.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం, విజయం సాధించి అధికారం చేపట్టడం కోసం బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ పోరులో ఉన్నాయి.

ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలూ అధికారమే లక్ష్యంగా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా పోటీలో బలంగా ఉంది. అక్కడ కర్నాటకలో మాత్రం బీడీఎస్.. పోటీలో ఉన్నా.. ఆ పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చే బలం లేదన్నది పరిశీలకుల మాట. అందుకే బీడీఎస్ కర్నాటకలో హంగ్ కోరుకుంటోంది. అలా హంగ్ వస్తే..కింగ్ మేకర్ రోల్ పోషించాలన్నది ఆ పార్టీ అభిమతం. ఇక్కడ తెలంగాణలో మూడు పార్టీలో హోరాహోరీ తలపడుతుండటంతో హంగ్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.  అయితే ఆ అంచనాలు, పరిశీలనలూ పక్కన పెడితే.. కర్నాటక ఎన్నికలలో బీజేపీపై కాంగ్రెస్ పై చేయి సాధిస్తే మాత్రం ఆ ప్రభావం తెలంగాణలో కచ్చితంగా ఉంటుందనీ, కాంగ్రెస్ అవకాశాలు మెరుగుపడతాయనీ చెబుతున్నారు.

ఎందుకంటే కర్నాటక ఫలితాల ప్రభావం రాష్ట్రంలో ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గు చేపేలా చేస్తుందని చెబుతున్నారు. అదీ కాక తెలంగాణలో గతంతో పోలిస్తే.. ఆ పార్టీ బాగా పుంజుకుందని సర్వేలే చెబుతున్నాయి. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక దాదాపు అంతే కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో  ఓటర్లు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. ఆ ప్రభావం నిస్సందేహంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుంది. ఇప్పటికే పుంజుకున్న బలం పొరుగురాష్ట్రంలో విజయంతో మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

అలా కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ ఏర్పడితే.. ఇక ఇప్పటికే తెలంగాణ సీనియర్ నేతలు చెబుతున్న జోస్యాలు, చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీతో జట్టుకట్టక తప్పని పరిస్థితి ఎదురౌతుంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం తెలంగాణలో, కర్నాటకలో అధికారం చే జిక్కించుకునేది కాంగ్రెస్సేనని ధీమాగా చెబుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం కోసం తెలంగాణ నుంచి ఎటువంటి సహకారం అయినా చేయడానికి సిద్ధమని చెబుతున్నారు. పైగా కర్నాటక పీసీసీ చీఫ్ తో రేవంత్ కు తొలి నుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే దక్షిణాదిన ఆ పార్టీకి ఏమైనా స్టేక్ అంటూ ఉందంటే ఇప్పటి వరకూ కర్నాటకలోనే.. ఇటీవలి కాలంలోనే తెలంగాణలో ఒకింత పుంజుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే కర్నాటకలో గెలవక తప్పని అనివార్య పరిస్థితి ఆ పార్టీది.

కానీ కర్నాటక ఆనవాయితీ ప్రకారం ఏ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా రెండో సారి అధికారం ఇవ్వరు. ఇప్పుడు కూడా అదే పునరావృతమైతే.. తెలంగాణపై ఆశలు కూడా వదిలేసుకోవలసిందేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఎలాగైనా కర్నాటకలో అధికారాన్ని  చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా తమ పార్టీ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉంది. 

By
en-us Political News

  
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.