కార్గిల్ విజయ్ దివస్ – భారత జెండా గర్వంగా ఎగిరిన రోజు..!

Publish Date:Jul 26, 2025

Advertisement


ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్ ని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి కార్గిల్ విజయ్ దివస్ ను ఒక పండుగలా జరుపుకుంటు ఉంటాం.  అయితే ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన భారత సైనికుల  దేశభక్తికి, సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచే ఒక మహత్తరమైన రోజు.

విజయ్ దివస్.. ఆవిర్భావం..

1999లో భారత దేశానికి సంబంధించిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్ లోయలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు,  ముష్కరులు, భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారిని వెనక్కు తోసి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత సైన్యం అసాధారణమైన ధైర్యాన్ని, ఓర్పును ప్రదర్శించింది.

ఈ యుద్ధాన్ని మనం కార్గిల్ యుద్ధం గా గుర్తించాము. సుమారు 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న భారత విజయం సాధించడంతో ముగిసింది. అందుకే ఆ రోజును “విజయ్ దివస్”గా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం.

కార్గిల్ యుద్దం.. ఒక సాహస గాథ..

కార్గిల్  యుద్ధంలో భారత సైనికులు ఎంతో కష్టసాధ్యమైన పర్వత ప్రాంతాల్లో పోరాడారు. కొండలపై దాక్కున్న శత్రువును తలకిందులు చేసి తామే పైచేయి సాధించడం అంటే సాహసానికి పరాకాష్ట.  ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ అనోజ్ థాపా, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, నాయిక్ సాయి సానూ లాల్, వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు.

ఎందుకు జరుపుకోవాలి?

కార్గిల్ విజయ్ దివస్‌ను మనం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే:

దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించటం

యువతలో దేశభక్తిని ప్రేరేపించటం

సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుని గర్వించటం

మనం ఏమి చేయగలం..


మౌనంగా రెండు నిమిషాలు నిలబడి వీరులకు నివాళులర్పించవచ్చు.

 పిల్లలకి, స్నేహితులకు కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా చెప్పి వారిలో చైతన్యం కలిగించవచ్చు.

దేశ భద్రతలో భాగమైన సైనికుల సేవలకు కృతజ్ఞతలు తెలపచ్చు.


కార్గిల్ విజయ్ దివస్  అందరికీ ఇచ్చే సందేశం..

 స్వేచ్ఛ విలువైనదని, అది ఎప్పటికీ తీసుకోలేనిదాని ఆ రోజు దేశ ప్రజలకు చెప్పకనే చెబుతుంది. మన దేశ సైనికుల ధైర్యం, పట్టుదల కారణంగానే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాము. ఈరోజు వారిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత.

                                        *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.