Publish Date:Oct 24, 2024
ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా గెలిచిన కరణం బలరాం, 2019 ఎన్నికలలో చీరాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. అంతకు ముందు వరకూ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం తెలుగుదేశం వీడి వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికలలో తన స్థానంలో కుమారుడిని పోటీలో దింపాలన్న ఆలోచనతోనే కరణం బలరాం వైసీపీ గూటికి చేరారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.
ఏది ఏమైనా కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడి జగన్ పంచన చేరడంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చీరాల నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కరణం బలరాంకు నిరసన సెగలు తగిలాయి. అయితే వాటిని వేటినీ కరణం బలరాం పట్టించుకోలేదు. ఆయన కోరుకున్నట్లుగానే 2024 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన కుమారుడు కరణం వెంటేష్ పోటీ చేశారు. అయితే ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ పరాజయం మూటగట్టుకుని రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
ఆ తరువాత కరణం వెంకటేష్ కు జగన్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కరణం బలరాం ఆశించారు. అయితే జగన్ మాత్రం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మేరుగ నాగార్జునకు కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కరణం బలరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమారుడితో సహా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి వివాహ నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబునాయుడిని కరణం బలరాం పలకరించారు. ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంకయ్యనాయుడు మనవడి నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అలాగే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఆయన చంద్రబాబును కలిసి పలకరించారు. ఇరువురూ కలిసి నవ్వుతూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా కరణం బలరాంతో మాటలకు కలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అంతే కాకుండా కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరుతున్నారన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karanam-balaram-to-join-tdp-39-187323.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.