కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

Publish Date:Jul 14, 2025

Advertisement

 

కడప ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన కారుల మధ్య నెలకొన్న పెనుగులాట, అరెస్ట్ లు ఉద్రిక్తత వాతావరణానికి దారితీశాయి . దళితులు తమ భూములను ఇతరులు కబ్జా చేశారని గత నెల రోజులుగా ఆర్డీవో  కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తున్నారు. వీరికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇచ్చింది. ఎందుకూ  సమస్య పరిష్కారం కాకపోవడం, అధికారులు స్పందించక పోవడం తో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు  ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. దీంతో  పోలీసులు ముట్టడిని బలవంతంగా బగ్నం చేసి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో పాటు ఆందోళనకాలను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితి అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించింది. పోలీసులు అరెస్టులతో ఆగకుండా నెల రోజులుగా  ఆందోళన చేపట్టిన దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. దీంతో  రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, బాధిత దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా కోరనుండి మా‌భూములకు విముక్తి కల్పించకపోగా తమను అరెస్ట్ చేయడం,చేయడం దీక్షా శిబిరం కూల్చివేయడం కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*అరెస్టులతో ఆపలేరు: రవిశంకర్ రెడ్డి

దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూఉంటే అధికారులు స్పందించకపోవడం , పోలీసులతో ఉద్యమాలను అణిచివేయాలని, టెంట్ ను తొలగించి దళితులను భయబ్రాంతులకు గిరిచేయడం  తగదని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండి పడ్డారు.అరెస్ లో పై ఆయన  మాట్లాడుతూ, పేదలైన దళితుల సమస్యలను పరిష్కరించాలని అడిగితే పోలీసులను పెట్టి అరెస్టు చేయడం సరైన పద్దతి కాదన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా న్యాయం అడుగుతున్న  దళితులపై పోలీసుల ఉక్కు పాదాలను మోపడం ఏమిటని అయన ప్రశ్నించారు, సమస్యలను అధికారులు  పరిష్కరించకుండా ఉద్యమాలను అరెస్టులతో ఆపుతామనుకోవడం అవివేకమని అన్నారు. 

దళితుల ఆందోళనలను అణచివేయటానికి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి గంటల తరబడి అరెస్టుకు ప్రణాళికలు చేసేబదులు పదినిమిషాలలో అధికారులు కూర్చుని సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. పాత కడప దళితుల భూమి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారు ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఎ సత్తార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మడగలం ప్రసాద్, వెంకటేష్, రాయలసీమ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, తస్లిమ్  రమేష్ బాబు, దివాకర్, గోపాల్, వీరయ్య, బాబు చిన్న సుబ్బయ్య, కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఓబులేసు, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్ల్యూ రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
 

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.