విశాఖ ఎంపీగా కె.ఎ.పాల్ ఘన విజయం!

Publish Date:May 16, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతోపాటు అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా  హోరాహోరీగా పోటీ నెలకొంది.. ఒక్క విశాఖపట్నం స్థానంలో తప్ప. ఎందుకంటే, ఈ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పోటీలో వున్నారు. దాంతో ఇక్కడ వార్ వన్‌సైడ్ అయిపోయింది. విశాఖ ఓటర్లు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న మతుకుమిల్లి భరత్‌ని, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీరాణిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ లాంటి మిగతా పార్టీల అభ్యర్థులను గానీ, ఇండిపెండెంట్లను గానీ ఎంతమాత్రం లెక్కచేయలేదు. విశాఖ ఓటర్లందరూ గంపగుత్తగా కేఏ పాల్‌కి ఓటేశారు. ఈవీఎంలలో సీరియల్ నంబర్ 14, కుండ గుర్తు పక్కనే వున్న బటన్ నొక్కేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా కేఏ పాల్ విజయం కన్ఫమ్ అయిపోయింది. ఇక ఓట్ల లెక్కింపు, రిజల్ట్ ప్రకటన లాంటి ఫార్మాల్టీస్ మాత్రమే మిగిలి వున్నాయి.

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కేఏ పాల్ చేసిన ప్రచారం ఓటర్ల మీద బాగా ప్రభావం చూపింది. తన సింబల్ కుండని పట్టుకుని రోడ్ల వెంట తిరగడం, సముద్రంలో వల వేసి చేపలు పట్టడం, అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం, విశాఖలో సముద్ర తీరం వెంట బోలెడన్ని మినీ హార్బర్లు కట్టిస్తానని చెప్పడం, అందరికీ ఉద్యోగాలు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తానని చెప్పడం, ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా కామెడీ పనులు చేసి ఓటర్లని కడుపారా నవ్వించడం.. ఇవన్నీ ఓటర్లను ఆకర్షించాయి.

ఓట్ల లెక్కింపు జరగడానికి ఇంకా 20 రోజుల టైమ్ వుంది. అప్పటి వరకూ వెయిట్ చేయడం ఎందుకని, ఎలాగూ తన విక్టరీ కన్ఫమ్ అయిపోయింది కాబట్టి, విశాఖ పార్లమెంట్ సభ్యుడి హోదాలో నియోజకవర్గ వ్యాప్తంగా రకరకాల అధికారిక కార్యక్రమాలు చేపట్టడానికి కేఏ పాల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నా విజయం ఖాయమైపోయింది. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 14 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో మొత్తం పది లక్షల ఓట్లు నాకు పడ్డాయి. మా పార్టీ చేసిన ఇంటర్నల్ సర్వేల్లో నేను 10 లక్షల మెజారిటీతో గెలవబోతున్నట్టు తెలిసిపోయింది. నియోజకవర్గంలో వున్న నాలుగు లక్షల క్రిస్టియన్ల ఓట్లు, రెండు లక్షల మంది యూత్ ఓట్లు, స్టీల్ ప్లాంట్ కొంటానని అన్నా కాబట్టి... రెండు లక్షల నిరుద్యోగుల ఓట్లు, ఇంకా రెండు లక్షల బలహీన వర్గాల ఓట్లు నాకు పడ్డాయి. విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ఢి కోసం ప్రణాళికలు రచిస్తున్నాను. రేపటి నుంచి నేను నియోజకవర్గంలో ఏం చేయాలనేది ప్లాన్ చేస్తున్నా. 100 రోజుల్లో విశాఖను అభివృద్ధి  చేసేస్తాను. ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అమలు చేసేస్తాను.  నా బర్త్ డే సెప్టెంబర్ 25. ఈలోగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి చూసి అందరూ షాకైపోతారు’’ అని కె.ఎ.పాల్ చెప్పారు. కె.ఎ.పాల్ లాంటి వ్యక్తి విశాఖ ఎంపీగా గెలవటం విశాఖ ప్రజల అదృష్టం. 

(రచన: మతిలేని మంగపతి, (ఎక్స్ వార్డ్ మేట్ టు కె.ఎ.పాల్), వార్డు నంబర్ 14, ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్, విశాఖపట్నం)

By
en-us Political News

  
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.