వేసవిలో కూడా పుదీనా మొక్క పచ్చగా పెరగాలంటే ఈ ఒక్కటి నీటిలో కలిపి వేయండి!
Publish Date:May 26, 2026
Advertisement
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క. ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ వరకు పుదీనాను ఉపయోగిస్తారు. ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/just-mix-this-in-water-for-a-lush-green-mint-plant-all-summer-35-220904.html




