జగన్ సర్కార్ కు ఇక దబిడి దిబిడే.. తప్పుడు కేసులపై పోరాటానికి న్యాయాధికారుల ఫోరం!

Publish Date:Jul 18, 2022

Advertisement

జగన్ కు సొంత పార్టీ ఎంపీ నుంచి  ఎదురౌతున్న  సెగ  ఇంతింత కాదు. నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు వదిలేదే అంటూ జగన్ సర్కార్ తప్పిదాలనూ, పరిమితికి మించి  తీసుకున్న అప్పులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేసులు పెట్టినా, సీఐడీ పోలీసులు  భౌతికంగా హింసించినా ఆయన తగ్గడం లేదు. పైపైచ్చు మరింత స్పీడుగా ముందుకు సాగుతున్నారు. కేంద్రం, రాష్ట్ర  ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రొకొ అన్నట్లుగా ఇంత కాలం సాగిన  హనీమూన్ పిరియడ్ కు ఇక తెరపడిందని అన్నారు.

నాకు మద్దతు  కావాలి..  నీకు అప్పులు కావాలి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో  మోడీ సర్కార్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోకూడదన్న  రీతిలో వ్యవహరించడం వల్ల  ఏపీలో జగన్ సర్కార్ విషయంలో  చూసీ చూడనట్టు వదిలేసిందా?, ఒక విధంగా  క్విడ్ ప్రోకొ అన్న చందంగా  కేంద్రం  రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయా?  అంటే వైసవీపీ  ఎంపీ రఘురామ కృష్ణం  రాజు ఔననే అంటున్నాయి. రాష్ట్రపతి  ఎన్నిక అయిపోయింది కనుక  ఇక  ఏపీలోని జగన్ సర్కార్ కు ఇక  దబిడి దిబిడేనని వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు అన్నారు. ముందు ముందు అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం  ఏపీ  సర్కార్ పట్ల కఠినంగా వ్యవహరించే  అవకాశం ఉందని పేర్కొన్నారు.  

 రాజ్యాంగ  విరుద్ధంగా  లిక్కర్ కార్పొరేషన్ పేరిట ఇప్పటికే 8500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారని, మరో రెండు వేల కోట్ల రూపాయలను తీసుకోబోతున్నారని తెలిపారు. రాష్ట్రం కేంద్రం విధించిన 28 వేల కోట్ల రూపాయల రుణ పరిమితిని మించి ఇప్పటికే  38 500 కోట్ల రూపాయల రుణాలు తీసుకుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు   జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలా?, వెళ్ళక్కర లేదా? అన్న పిటీషన్ పై వాదనలు ముగిసి ఇప్పటికే 200 రోజులు గడుస్తున్నదని చెప్పారు. అయినా కోర్టు ఇంకా తీర్పు వెలువరించలేదని, ఒకవేళ తీర్పు అంటూ వస్తే… జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావాలనే  వస్తుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

కోర్టు హాజరై, నిలబడవలసి వస్తుందని అన్నారు. వ్యవస్థలన్నింటిని చాలా వరకు మ్యానేజ్ చేస్తున్నారని, కోర్టుకు వెళ్లాలా ?వద్దా? అన్న విషయాన్ని హైకోర్టు చెప్పదని, దర్యాప్తు సంస్థ ప్రశ్నించదని రఘురామ అన్నారు. తాను వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వాదనలు ముగిసి కూడా 200 రోజులైందన్న ఆయన, పిటిషన్ స్వీకరిస్తారా?, కొట్టివేస్తారా?? అన్నది ఇంకా తేల్చి చెప్పలేదన్నారు. హైకోర్టులో కొట్టివేస్తే,   సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. హైకోర్టులో ఈ ఆర్డర్ పెండింగ్ లో ఉందని, సిబిఐ కొట్టేసిందన్నారు. సిబిఐ కోర్టు , దర్యాప్తు సంస్థ… జగన్మోహన్ రెడ్డి , కోర్టు కు ఎందుకని హాజరు కావడం లేదని ప్రశ్నించడం లేదని అన్నారు.

తన పట్ల  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  క్రూరంగా వ్యవహరించిన జగన్ సర్కార్ శారీరకంగా హింసించి, భౌతికంగా లేకుండా  చేయాలని చూశారనీ, ఏ  మాత్రం నిలబడని చెత్త కేసులు పెట్టారని ఆయన అన్నారు. తన ఇంటి వద్ద, రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన పోలీస్ కానిస్టేబుల్ ను, తన రక్షణ సిబ్బంది గా ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులకు అప్పగించారన్నారు. అయితే సిగ్గు లేకుండా జగన్ మోహన్ రెడ్డి తనపై తప్పుడు కేసులను పెట్టించి, సిఆర్పిఎఫ్ అధికారులతో మాట్లాడి తన రక్షణ సిబ్బంది గా ఉన్న ఇద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేయించారని చెప్పారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ విషయములోనూ ఇదే టెక్నిక్ ను ఉపయోగించే అవకాశం లేకపోలేదు అన్నారు. కుదిరితే రామ్ సింగ్ సస్పెండ్ చేయించడం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

మంత్రి శంకర్ నారాయణ గడప గడపకూ అంటూ విచ్చిన సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి    లక్ష్మీబాయిపై అనే మహిళపై తప్పుడు కేసు పెట్టారని రఘురామకృష్ణం రాజు  అన్నారు. గత ప్రభుత్వంలో  వచ్చిన పింఛన్ ఇప్పుడు ఎందుకు తీసేశారని అడగడం తప్పా అని నిలదీశారు.   ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కేసులను బనాయిస్తారొనన్న ఆందోళనలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు  ఉన్నారన్నారు. తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు న్యాయాధికారుల ఫోరం ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ప్రధానమంత్రి హాజరవుతున్న సభకు ఆహ్వానం అందినా, స్థానిక ఎంపీకి ఆహ్వానం అందలేదన్న కారణంగా సభకు వెళ్లకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకోవడం  చాలా గొప్ప విషయమన్నారు.    
 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.