జూబ్లీహిల్స్ ‘రిచ్ కిడ్స్ ట్రాప్’లో మరో ఇద్దరి అరెస్ట్..!

Publish Date:Aug 11, 2026

Advertisement

 

సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ ‘రిచ్ కిడ్స్ ట్రాప్’ కేసులో దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేయడంతో కేసు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. హఫీజ్‌పేటకు చెందిన కోడూరి మీనా కుమారి, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబు పోలీసులకు చిక్కారు. జూబ్లీహిల్స్‌లో మొదలైన పోలీసుల వేట.. చివరకు రాజస్థాన్‌లోని జైపూర్ వరకు సాగింది. బందర్సెంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరినీ అదుపులోకి తీసు కున్న పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

ఈ వ్యవహారంలో నిందితు లందరూ సోషల్ మీడియా నే ప్రధాన ఆయుధంగా ఉపయోగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలికలు, యువతులను సోషల్ మీడియా ద్వారా పరిచ యాలు పెంచుకుని.. వారి కుటుంబ నేపథ్యం, వ్యక్తి గత వివరాలు, ఇతర సమాచారాన్ని సేకరించి నట్లు తెలుస్తోంది. పరిచ యం పెరిగిన తర్వాత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అదే సమాచారంతో వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి గా పేర్కొంటున్న కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలి యాస్ అర్జున్‌తో పాటు పలువురిని పోలీసులు జూన్‌లోనే అరెస్ట్ చేశారు. అప్పట్లో మీనాకుమారి, వినీల్ చౌదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకు న్నప్పటికీ వారిని రిమాండ్‌కు పంపలేదు.

కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసుల చేతికి మరిన్ని ఆధారాలు చిక్కాయి. దీంతో ఇద్దరినీ మరోసారి అరెస్ట్ చేసేం దుకు పోలీసులు ప్రయ త్నించగా.. అప్పటికే వారు పరారైనట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు నింది తుల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. వారి ఆచూకీపై సమాచారం సేకరించి హైదరాబాద్‌ నుంచి రాజస్థాన్ వరకు వేట కొనసాగించారు. చివరకు జైపూర్‌లోని బందర్సెంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి ఆచూకీ లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 

మీనాకు మారి, వినీల్ చౌదరి అరెస్ట్‌తో కేసు దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. ఈ ట్రాప్ వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? ఎంతమంది బాలికలు, యువతులు బాధితులుగా మారారు? సోషల్ మీడియా ద్వారా ఎలా వల వేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు సమాచారం. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలైన పరిచయం.. చివరకు పోలీసుల వెంటాడే స్థాయికి వెళ్లిన ఈ వ్యవహారంలో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Jubilee Hills Rich Kids Trap, Social media, Vinyl Chowdhury, Arjun, Crime news, CP Sajjanar, Koduri Meena Kumari

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.