ఉత్తరాఖండ్ లో అత్యంత పవిత్రమైన జోషీమఠం కుంగిపోతోందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే భూమి కుంగిపోయి వందలాది ఇళ్లు బీటలు వారాయి. పట్టణంలోని జనం బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. పట్టణం సింకింగ్ జోన్ లో ఉందని కేంద్రం ప్రకటించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
రిలీఫ్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హిమాలయ పట్టణమైన జోషిమఠ్ కుంగుబాటుకు గురై అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇప్పటికే ఛమోలీ జిల్లా కలెక్టర్ హిమాన్షు ఖురానా గడప గడపకు వెళ్లి స్థానికులను కలుస్తున్నారు. చీలికలు వచ్చిన భవనాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జోషిమఠ్ లో 4,500 భవనాలుండగా వీటిలో 610 భవనాలు బీటలు వారాయి.వాటిలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. మొత్తం సహాయక చర్యలను ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారినందరినీ అక్కడి నుంచి తరలించాలని కేంద్రం భావిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/joshimuth-sinking-center-confirms-25-149730.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.