బీజేపీది ద్వంద్వ వైఖరి.. గంగలో మునిగితే పాపాలు.. బీజేపీలో చేరితే అవినీతి ఆరోపణలూ మాయం?!

Publish Date:Mar 27, 2024

Advertisement

కేంద్రంలోని మోడీ సర్కార్ అవినీతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంది. అస్మదీయులపై అవినీతి ఆరోపణలను పట్టించుకోదు. తస్మదీయులైతే మాత్రం తన అధీనంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది. అదేమిటన్న ప్రశ్నకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మాకు ఏంటి సంబంధం అని ఎదురు ప్రశ్న వేస్తుంది. 

సీబీఐ, ఈడీ, ఐటీ  వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తడానికి మోడీ సర్కార్  తీరే కారణం  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదలు కల్వకుంట్ల కవిత వరకూ, మమతా బెనర్జీ మొదలు అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్,కేటీఆర్ వరకూ,శరద్ పవార్ మొదలు ఉద్ధవ్ థాకరే వరకూ, చిన్నా పెద్ద అవినీతి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న, ఎదుర్కొన్న రాజకీయ నాయకులు, ఆ నాయకుల మద్దతుదారులే ఇందుకు ఉదాహరణ.   

 ఇటీవల కాలంలో  కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలగుప్పిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ ఆరోపణలలో వాస్తవం లేకపోలేదని అనిపించక మానదు.  సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో  సింహభాగం బీజేపీని వ్యతిరేకించే నేతలు, మోడీ అధికారన్ని ప్రశ్నించే పార్టీల అధినేతలవేనన్న విషయం తెలిసిందే.   ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరైనా కమలం తీర్థం పుచ్చుకుంటే వారి అవినీతి మరక అంటని పునీతులుగా మారిపోతున్నారు.  ఔను బీజేపీ పార్టీలో చేరిన తరువాత అప్పటి వరకూ అవినీతి పరులుగా వారిపై గుప్పిస్తున్న విమర్శలకు ఠక్కున ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఉదాహరణకు అక్రమ మైనింగ్ సహా పలు కూసులను ఎదుర్కొంటూ, జైలుకు కూడా వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి   బీజేపీ రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలోకి వెల్ కమ్ చెప్పింది.

అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అదే సమయంలో ఏపీలో మద్యం అమ్మకాలలో జగన్ రెడ్డి సర్కార్ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పాపం ఈడీ ఆ ఫిర్యాదువైపు కూడా చూడలేదు. ఇందుకు కారణాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.  బిజెపి కక్షపూరిత రాజకీయాలు అవలంబిస్తోందనడానికి ఇవే ఉదాహరణలు.   

By
en-us Political News

  
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.