కర్మ రిటర్న్స్ అంటే ఇదే.. జోగి రమేష్ కు రాజకీయ సమాధే.!
Publish Date:Aug 18, 2026
Advertisement
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొడుకు జోగి రాజీవ్ తన తండ్రిపై తిరగబడినట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జోగి రాజీవ్ వివాహం, ఆ తదనంతర పరిణామాలపై దాఖలైన కేసు ఆధారంగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అంశాలకు ఈ వీడియోలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియో.. ఆమె ఫిర్యాదుకు బలం చేకూర్చడమే కాకుండా.. కేసు తీవ్రతను తేటతెల్లం చేశాయి. ఆమె ఫిర్యాదు, తాజాగా విడుదల చేసి తాజా వీడియో ఆధారాలు సమస్య తీవ్రతను స్పష్టం చేస్తున్నాయని డీవీ శ్రీనివాస్ అన్నారు. లీక్ అయిన వీడియోలో రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ ఎదుటే గట్టిగా నిలదీస్తూ కేకలు వేయడం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన ఆ వీడియోలో.. తనకు మేఘనను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదనీ, తనకు నువ్వే బలవంతంగా చేశామనీ తండ్రి జోగి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అదంతా పక్కన పెడితే.. మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు చాలా తీవ్రమైనవని పేర్కొన్న డీవీ శ్రీనివాస్.. 50 లక్షల రూపాయల పెళ్లి ఖర్చుల అంశంతో పాటు అదనపు కట్నం కోసం ఒత్తిడి, గోవా పర్యటనలోనూ, ఇబ్రహీంపట్నంలోని నివాసంలోనూ తనపై హత్యాయత్నం జరిగిందని మేఘన ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని డీవీ శ్రీనివాస్ అన్నారు. సామాన్యుల విషయంలో ఇలాంటి తీవ్ర ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, మాజీ మంత్రి ఫ్యామిలీ విషయంలో ఎందుకు విచారణ వేగవంతం చేయలేదని నిలదీశారు. గతంలో ప్రతిపక్ష నేతల నివాసాలపై దాడి చేయడం, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా నిత్యం వివాదాలలో నిలిచిన జోగి రమేష్‌కు ఈ వ్యవహారం రాజకీయంగా ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జోగు రమేష్ కు కర్మ రిటర్న్ అయ్యిందన్న చర్చ జరుగుతోందన్న డీవీ శ్రీనివాస్.. ఇది జోగి రమేష్ కు రాజకీయ సమాధిగానే చూడాలన్నారు. Jogi Ramesh, Jogi Rajiv, Meghana, Familydispute, SonRevolt #Jogi Ramesh Family Issue, TeluguOne, DVSrinivas
డీవీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి
http://www.teluguone.com/news/content/jogi-ramesh-25-229159.html





