మరణమంటే జీవితంలో బాగమని చెప్పకనే చెప్పిన తత్వవేత్త.. జిడ్డు కృష్ణమూర్తి వర్థంతి..!

Publish Date:Feb 17, 2025

Advertisement

 


జె.కె అంటే ఆధ్యాత్మికత, తత్వ చింతనల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తులు,  పుస్తకాలను అధ్యయనం చేసిన వారికి బాగా తెలిసి ఉంటుంది. కానీ చాలామందికి జె.కె అంటే జిడ్డు కృష్ణమూర్తి అని తెలియదు.  జిడ్డు కృష్ణమూర్తి భారతదేశపు ప్రసిద్ధ తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. నిజానికి జిడ్డు కృష్ణమూర్తి ఒక గొప్ప గురువు అని చెప్పవచ్చు. కానీ ఆయన గురువు అని పిలిపించుకోవడానికి నిరాకరించారు. ఫిబ్రవరి 17,  1986లో జిడ్డు కృష్ణమూర్తి మరణించారు.  ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..


జిడ్డు కృష్ణమూర్తి గొప్ప తత్వవేత్త,  ఆధ్యాత్మిక బోధనలు ఎన్నో ఈయన నుండి వెలువడ్డాయి.  ఈయన చేసిన బోధనలలో అశాశ్వతం అనే ఇతివృత్తం గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ఈయన ఇచ్చిన తొలి ఉపన్యాసం నుండి చివరి వరకు మరణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవశ్యత గురించి ఈయన ఎక్కువ మాట్లాడారు. మరణానికి భయపడకూడదని,  మరణాన్ని వాయిదా వేయకూడదని, మరణాన్ని తిరస్కరించకూడదని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు.దీన్ని బట్టి మరణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనేది జిడ్డు కృష్ణమూర్తి తత్వమని అర్థం అవుతుంది. అంటే.. మరణం గురించి అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.  ప్రతి మనిషి జీవించడం పట్ల ఎంత ఉత్సుకతతో.. ఎంత ఆశతో ఉంటాడో.. మరణం విషయంలో కూడా అంతే ఉత్సుకతతో ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి చెప్తారు.


జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని గమనిస్తే.. ఆయన మరణం గురించి, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి ఆయన చెప్పిన విషయాలకు ఒక రూపం ఇస్తే ఆయన మరణం వైపు సాగిన ప్రయాణం కూడా అదే విధంగా ఉంటుంది. జీవితంలో ప్రతి అంశానికి ఒక స్పష్టత ఉంటుంది. అదే విధంగా మరణానికి కూడా ఒక స్పష్టత అనేది ఉంటుంది.  దాన్ని ఇతర విషయాల లాగే భావించినప్పుడు మరణం అంటే భయం,  బాధ, తప్పించుకోవాలని పారిపోవాలనే ప్రవర్తన అస్సలు ఉండవట. జిడ్డు కృష్ణమూర్తి మరణం గురించి చెప్పిన విషయాలు అక్షరాలా పాటించాడని చెప్పడానికి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే సాక్ష్యులు.  


జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని జీవితానికి విరుద్దమైన అంశంగా ఎప్పుడూ చూడలేదు. ఆయన మరణానికి చేరువ అవుతున్న కొద్దీ ఆయన శరీరం క్షీణిస్తూ ఉంటే.. ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవారట. చాలా తక్కువగా మాట్లాడేవారట, ఎలాంటి డ్రామా జరగకుండా చాలా ప్రశాంతంగా జిడ్డు కృష్ణమూర్తి మరణం జరిగిందని అంటారు. కాలం వల్ల,  మనిషి తాను ఊహించుకునే విషయాలు,  మనిషి తాను అనుభూతి చెందే ఎన్నో రాగద్వేషాల  నుండి విముక్తి పొంది అవగాహనతో జీవించడం, మరణించడం అనేది  జిడ్డు కృష్ణమూర్తి మాటల్లోనూ,చేతల్లోనూ కూడా చూపించారు.  


ప్రముఖ వ్యక్తులు తమ చివరి రోజుల్లో లేదా చివరి ఘడియల్లో  కొన్ని విషయాలు ప్రధానంగా ప్రస్తావించి ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తి చివరి మాటలు కూడా చాలా సరళమైనవే అయినా చాలా లోతుగా మాట్లాడారు.  ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఒక వాక్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది."శరీరం ఇంకేమి తట్టుకోగలదో నాకు ఖచ్చితంగా తెలియదు" అని ఆయన అన్నారు.  ఈ మాట ఆయన శరీరం చివరి రోజుల్లో ఎంత బాధ అనుభవించి ఉంటుందో,  ఆయన ఎంత బాధపడి ఉంటారో చెప్పకనే చెబుతుంది. అయినా సరే.. అవన్నీ మానవ శరీరానికి తప్పవనే నిజాన్ని ఆయన అంగీకరించారు.  ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని ప్రతి మనిషిని అంగీకరించినప్పుడు మరణం గురించి అందరికీ అర్థం అవుతుంది. మరణం మీద అవగాహన వస్తుంది.  మరణం అంటే భయం పోతుంది.


                                               *రూపశ్రీ.

By
en-us Political News

  
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.