Publish Date:Jun 18, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. మొదటినుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ వంటి వారు తరచూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమను అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తోందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.
తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణుల అంతు చూస్తామని, ఇప్పటినుంచే జైళ్లు రిపేరు చేయించకోవాలని వైసీపీ నేతలు పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది చేతగానితనం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వైసీపీ నేతల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా రన్నారు. మీకు నాలుగేళ్ల సమయం కావాలేమో.. మేము ఇప్పుడే ఉతికితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడితే చితక్కొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తల వైపు కాకుండా.. వైసీపీ వైపే చంద్రబాబు ఉన్నారన్నారు. కాబట్టే వారు చెలరేగిపోతున్నారన్నారు. వారు ఇలాగే మాట్లాడితే చితగ్గొట్టాలన్నారు. లైన్ దాటి బహిరంగంగా ఆయన అలా పిలుపునివ్వడం, బూతు పదజాలంతో విరుచుకుపడడం, తమ అధినేతకు సైతం పరోక్షంగా చురకలంటించడం వివాదాస్పదంగా మారాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jc-prabhakar-reddy-39-200256.html
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?
మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్ హై స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.
డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు.
మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.