దూకుడు పెంచిన జనసేన.. పవన్ కు తోడుగా గళమెత్తుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు

Publish Date:Jun 23, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం  కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అటు ప్రభుత్వ  పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటూనే, ఇటు పార్టీ అంతర్గత కార్యాచరణను కూడా ఆయనే ముందుకు తీసుకువెడుతున్నారు. దీంతో పవన్  వర్క్‌లోడ్‌తో పవన్ సతమతమవుతున్నారు. ఆయనకు  పార్టీ నేతల నుంచి   ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది.

ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.  అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి, పార్టీ నాయకుల తీరుపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా వారిలో  కదలిక వచ్చింది.

పవన్ కళ్యాణ్ క్లాస్ పీకడంతో జనసేన అగ్ర నేతలైన కందుల దుర్గేష్, పంతం నానాజీ వంటి వారు  యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు. ప్రతిపక్షాల వ్యూహాత్మక విమర్శలను తిప్పికొట్టేందుకు మీడియా ముందుకు వచ్చి ప్రతి విమర్శలు చేస్తున్నారు.  సాయి కృష్ణ మిస్సింగ్ అంశంపై వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్రంగా ఖండించారు. ఈ సున్నితమైన అంశాన్ని వాడుకుని ఒక ప్రత్యేక సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్‌పై వ్యతిరేకత పెంచాలని చూస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు. కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రాథమిక దశలోనే తుడిచిపెట్టడం జనసేనకు అత్యంత అవసరంగా మారిందనడంలో సందేహం లేదు. 

మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలకు జనసేన నాయకుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ  ఘాటుగా  కౌంటర్ ఇచ్చారు. కుల ప్రస్తావన లేకుండా, పవన్ కళ్యాణ్   ఒక్క సీటైనా గెలవగలరా అన్న అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ గా..  జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల దాటి బయట ఎక్కడైనా నిలబడి గెలిచే దమ్ముందా అని నిలదీశారు.  సత్తా ఉంటే కాకినాడ రూరల్ నుంచి గెలిచి చూపాలని సవాల్ విసిరారు.  జనసేన నాయకత్వం ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం ఆ పార్టీ కార్యకర్తలలో జోష్ ను నింపింది.  జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఇదే జోష్ ముందుముందు కూడా కొనసాగాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. 

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.