జైపాల్ కి అంత సింపతీ అవసరమా?
Publish Date:Oct 30, 2012
Advertisement
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి వద్దంటే సింపతీ వెల్లువెత్తుతోంది. పెట్రోలియం శాఖ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన్ని మార్చడం డిమోట్ చేయడమేనని చాలామంది అనుకుంటున్నారు. రిలయన్స్ సంస్థతో జైపాల్ రెడ్డి పెట్టుకున్న పంచాయతీ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని ఊరూవాడా కోడై కూస్తోంది. వాస్తవానికి పెట్రోలియం శాఖ మంత్రిగా జైపాల్ రెడ్డి దేశానికి చాలా మేలుచేశారన్న అభిప్రాయం జనసామాన్యంలోకూడా గట్టిగానే ఉంది. కానీ.. అదే సమయంలో రిలయెన్స్ సంస్థకి నష్టం వాటిల్లిన కారణంగా ఆయన కుర్చీని వదులుకోవాల్సొచ్చింది. ఇదంతా జనంలో ఉన్న సిపంతీవేవ్.. కానీ నిజంగా జైపాల్ కి అంత సీనుందా.. అని కొందరు గట్టిగానే అడుగుతున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపుల విషయంలో జైపాల్ రెడ్డి చూసీ చూడనట్టు ఊరుకున్నారు.ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేసరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కల్పించుకుని ప్రథానితో గట్టిగా మాట్లాడాల్సొచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ కేటాయింపులు జరిగాయి."నేను జాతీయవాదిని, ఓ రాష్ట్రం ప్రయోజనాలగురించి ఆలోచించేవాడిని కాదు.." అంటూ జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాతగానితనాన్ని బైటపెట్టడమేకాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రమంత్రిగా వెళ్లిన ఆయనకు మన రాష్ట్రంమీద ఎంత మక్కువ ఉందో చెప్పకనే చెప్పాయి. ఏపీనుంచి ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవులు చేపట్టినవాళ్లు మనరాష్ట్రాన్ని చులకనచేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోకూడా ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ప్రథానిగా పనిచేసిన పి.వి.నరసింహారావువల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఇప్పుడూ అదే జరుగుతోంది. రైల్వేశాఖ మిగతా ఏరాష్ట్రానికి దక్కినా వరాలజల్లుకురుస్తుంది. కానీ.. ఏపీకి దక్కినప్పుడు మాత్రం ఉత్తచేతులు ఊపుకుంటూ రావడంతప్ప మన మంత్రులు సాధించగలిగేదికూడా ఏదీ లేదన్న విషయం మొత్తం రాష్ట్రానికి తెలిసిన విషయమే. ఏంటో మన మంత్రులకు మన రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన ఎప్పటికి కలుగుతుందో ఏమో..
http://www.teluguone.com/news/content/jaipal-reddy-31-18701.html





