సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దు..!

Publish Date:Jul 30, 2026

Advertisement

 

విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు  దురుసు ప్రవర్తన..!

వైసీపీ అధినేత జగన్‌ శ్రీకాకుళం పర్యటన సందర్బంగా ఆ పార్టీ నాయకులు శ్రుతిమించి ప్రవర్తించారు. విధుల్లో ఉన్న ఒక మహిళా పోలీస్ అధికారి పట్ల సదరు పార్టీ నేతలు అత్యంత దురుసుగా వ్యవహరించడం తీవ్ర కలకలం రేపింది.

శ్రీకాకుళం నగర పరిధిలోని కొత్తరోడ్డు కూడలి వద్ద ఈ చేదు సంఘటన చోటుచేసుకుంది. జగన్ రాక సందర్భంగా అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ కోసం బూర్జ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్సై ప్రవళ్లిక బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

ఆ సమయంలో ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ తన అనుచరులతో కలిసి తీవ్ర తోపులాటకు దిగారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎస్సై ప్రవళ్లికను ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులు బలంగా పక్కకు నెట్టివేసినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

చట్టాన్ని పరిరక్షించే యూనిఫాంలో ఉన్న మహిళా అధికారినని కూడా చూడకుండా నాయకులు ప్రదర్శించిన ఈ రకమైన ప్రవర్తన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఈ శ్రీకాకుళం పర్యటనను చేపట్టారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

అయితే, బాధ్యతాయుతమైన అధికారిక విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు ఇలా దౌర్జన్యానికి దిగడం పట్ల ప్రజాసంఘాలు, మహిళా మండళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ రౌడీయిజం చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై విధులకు విఘాతం కలిగించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా అధికారులపై ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిక్కోలు వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ రద్దు అయింది. జైలు నిబంధనల మేరకు 5 గంటల వరకే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బొత్స, పలువురు వైసీపీ నేతలు లాయర్లు జైలులోకి వెళ్లి సీదరిని పరామర్శించి బయటకు వచ్చారు.

Jaganmeeting with Seediri Appalaraju cancelled, Srikakulam tour, SI Paravallik, YSRCP, 
MLC Botsa, Chintada Ravikumar, Seediri Appalaraju

By
en-us Political News

  
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
నాపై జరుగుతున్న ప్రచారాన్ని ఆపండి అంటూ బాధితురాలి విజ్ఞప్తి..!
హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మెట్రో ప్రయాణం ఒక హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సరాసరి మెట్రో స్టేషన్‌కు చేరుకుని సాధారణ ప్రయాణీకుడిలా క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణికుల మధ్య కూర్చుని పక్కన ఉన్న వారితో ముచ్చటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.