అగ్గిపెట్టె, పిట్టగూడు? ఇల్లంటే ఇదా? ఆ ఇంట్లో జగనన్న ఉంటారా?

Publish Date:Jun 29, 2021

Advertisement

ఇల్లు అంటే.. నాలుగు గోడ‌లు, పైక‌ప్పు కానే కాదు. ఇల్లు అనేది ఓ అనుబంధం. ఇల్లు అనేది ఓ అనుభూతి. ఇల్లు మ‌మ‌త‌ల కోవెల‌లా మారాలంటే.. అందుకు త‌గ్గ‌ట్టు ఆ ఇల్లు ఉండాలి. విశాల‌మైన హాల్, వంటకు స‌రిప‌డా కిచెన్‌, క‌నీసం డ‌బుల్‌బెడ్ ప‌ట్టేంత బెడ్‌రూమ్ త‌ప్ప‌నిస‌రి. అలాంటి ఇంటిలోనే అనురాగాలు విర‌బూస్తాయి. కానీ, అగ్గిపెట్టె, పిట్ట‌గూళ్ల‌లాంటి ఇల్లు ఉంటే.. అందులో క‌ష్టాలు, క‌న్నీళ్లే కానీ, సంతోషాలు, అనుభూతుల మాటే ఉండ‌దు. ఏపీలో ప్ర‌భుత్వం నిర్మిస్తున్న జ‌గ‌న‌న్న ఇళ్ల దుస్థితి అలానే ఉంద‌ని అంటున్నారు. పేరుకే అది ఇల్లు.. ఉండ‌టానికి ఇరుకిరుకు. డాబు కోసం, ప్ర‌చారం కోస‌మే కానీ, పేద‌లు ఉండ‌టానికి ఆ ఇళ్లు పనికిరావ‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ఇళ్ల సంఖ్య‌ను పెంచడానికి.. ఇంటి సైజును బాగా త‌గ్గించేశారంటున్నారు. 30 ల‌క్ష‌ల ఇళ్లంటూ ఆర్బాట‌మే కానీ, అందులో ఏ ఒక్క ఇల్లు కూడా ఉండ‌టానికి ప‌నికొచ్చేలా లేదంటున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలంలో, పట్టణాల్లో సెంటు స్థలం ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇంట్లో హాల్, బెడ్‌రూమ్, కిచెన్‌, బాత్రూమ్‌. పేరుకైతే అన్నీ ఉన్నాయి కానీ, అవి ఉన్న తీరే నివాసానికి ప‌నికిరాకుండా ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లు మరీ చిన్నవిగా అగ్గిపెట్టెల్లా ఉన్నాయంటున్నారు. 24 గ‌జాల్లో బెడ్‌రూమ్‌. అసలేమైనా స‌రిపోతుందా? ఓ ఇద్ద‌రు మ‌నుషులు అందులో ప‌డుకోగ‌ల‌రా? 6 బై 4.. సింగిల్‌కాట్ బెడ్ వేస్తేనే గ‌దంతా నిండిపోతుంది. ఇక అటూ ఇటూ న‌డిచేదెలా? కాస్త పెద్ద సైజు మంచం వేసుకోవాలంటే ఎలా? 24 గ‌జాల్లో ఎవ‌రైనా బెడ్‌రూమ్ క‌డ‌తారా? తాడేప‌ల్లి ప్యాలెస్‌లో సీఎం జ‌గ‌న్ బాత్రూమ్ కూడా ఇంత‌కంటే పెద్ద‌దిగా ఉంటుంది. అలాంటిది.. పేద‌ల‌కు మ‌రీ ఇంత చిన్న బెడ్‌రూమ్ క‌ట్టిస్తే వారు అందులో కాపురం చేసేది ఎలా? అందుకే కాబోలు వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి.. జ‌గ‌న‌న్న ఇళ్ల బెడ్‌రూమ్ కొత్త జంట శోభ‌నానికి ప‌నికి రావు అంటూ ఎద్దేవా చేసింది. మీ పార్టీ ఎమ్మెల్యేనేగా.. ఆయ‌న‌కు ఆ బెడ్రూమ్ చూసి ఎంత ఇబ్బందిగా అనిపిస్తే ఆ మాట అనుంటారు.. కొంచెం ఆలోచించండి జ‌గ‌న‌న్నా.. మ‌రీ ఇంత చిన్న బెడ్‌రూమ్ ఏంట‌న్నా..? ఓసారి మీరొచ్చి ఆ బెడ్‌రూమ్‌లో పడుకొని చూపించండి.. అప్పుడు జ‌నం న‌మ్ముతారు.. ఆ సైజ్ బెడ్‌రూమ్ ప‌డుకోవ‌డానికి ప‌నికొస్తుంద‌ని.. అని అంటున్నారు ల‌బ్దిదారులు. 

ఇక‌, క‌నీసం హాల్ అయినా విశాలంగా ఉంటుందా? అంటే అదీ లేదు. అస‌లు దాన్ని హాల్ అని ఎందుకు అనాల‌నే డౌట్‌. ఏ యాంగిల్‌లోనూ అది హాల్ సైజులో ఉండ‌దు. చిన్న రూమ్ అంతే. రెండు కుర్చీలు వేస్తే.. ఇక ఖాళీనే ఉంద‌డు. మ‌రీ అంత చిన్న సైజ్ రూమ్ అది. ఇక హాలే అంత చిన్న‌గా ఉంటే.. ఇక కిచెన్ సైజు గురించి చెప్పేదేమున్న‌ది. అందులోకి వ‌న్‌వే ఎంట్రీనే. ఒకేసారి ఇద్ద‌రు పట్ట‌రు అందులో. ఇక బాత్‌రూమ్ అయితే.. లావుగా ఉన్న‌వాళ్లు అందులోకి వెళ్ల‌నే లేరు. ఇలా.. నాలుగు అగ్గిపెట్టె గ‌దుల‌ను క‌ట్టేసి.. దానికి వైసీపీ రంగులు పూసేసి.. ఇదే జ‌గ‌న‌న్న ఇల్లు.. పండ‌గ చేస్కోండి అంటే ఎలా? పేరు గొప్ప.. ఇల్లు దిబ్బలా ఉంది య‌వ్వారం అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

పోనీ, ఆ పిట్ట గూడు ఇళ్లైనా గ‌ట్టిగా క‌డుతున్నారా? అంటే అదీ లేదు. నాణ్య‌త అంతంత మాత్ర‌మే. గ‌ట్టిగా గాలి వీస్తే ఇల్లు ఊగిపోతుందా? కుప్ప కూలిపోతుందా? అనే అనుమానం. ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో వాడే ఇళ్ల నిర్మాణ శైలితో జ‌గ‌న‌న్న ఇల్లు క‌డుతున్నారు. ఇటుక‌లు లేకుండా ప్లాస్టిక్ వేస్టేజ్‌తో గోడ‌లు క‌డుతున్నారు. ఇవి ఇక్క‌డి వెద‌ర్ కండిష‌న్‌కు స‌రిపోవ‌ని నిపుణులు హెచ్చ‌రించినా.. పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. చీప్‌గా వ‌స్తున్నాయ‌నే క‌క్కుర్తితో.. పేద‌లే క‌దా ఉండేది.. మేము కాదుగా అనే చిన్న‌చూపుతో మ‌రీ నాణ్య‌త లేకుండా జ‌గ‌న‌న్న ఇళ్లను క‌డుతున్నారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.     

డ‌బ్బులేమ‌న్నా.. జ‌గ‌న్‌రెడ్డి జేబులో నుంచి పెట్టుకుంటున్నారా? కేంద్ర ప్ర‌భుత్వమే క‌దా ఆ ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక‌ సాయం చేసేది. కాస్త మంచిగా, నివాస యోగ్యంగా ఇళ్లు క‌డితే జ‌గ‌న్ సొమ్మేమైనా పోతుందా? అంటూ జ‌నాలు మండిప‌డుతున్నారు. సెంటు స్థ‌లంలో ఇల్లేంటంటూ పెద‌వి విరుస్తున్నారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో క‌ట్టిన అపార్ట్‌మెంట్స్‌తో ఇప్ప‌టి జ‌గ‌న‌న్న ఇళ్ల‌ను పోల్చి చూపి.. అస‌హ్యించుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అని అంద‌ల‌మెక్కిస్తే.. మ‌రీ ఇంత‌టి దౌర్భాగ్య పాల‌నా అంటూ త‌మ‌ను తామే నిందించుకుంటున్నారు. 

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పేద‌ల కోసం హైటెక్ భ‌వ‌న స‌ముదాయాల‌ను నిర్మించారు. భూకంపం వ‌చ్చినా చెక్కు చెద‌ర‌ని టెక్నాల‌జీతో అపార్ట్‌మెంట్స్ క‌ట్టించారు. వాటిని బ‌య‌టి నుంచి చూస్తేనే.. సూప‌ర్‌గా ఉంటాయి. ఇక లోప‌లికెళితే అవాక్క‌వ్వాల్సిందే. అంత విశాలంగా, ఉన్న‌త ప్ర‌మాణాల‌తో, మోడ్ర‌న్ ఫ్లాట్స్ నిర్మించారు. అంతా రెడీ.. ఇక ప్రారంభోత్స‌వ‌మే మిగిలింది అనుకున్న త‌రుణంలో ప్ర‌భుత్వం మారింది.

పేద‌ల నోట్లో మన్నుకొడుతూ.. ఆ అంద‌మైన అపార్ట్‌మెంట్స్‌ను అలానే నిరూప‌యోగంగా వ‌దిలేశారు. ల‌బ్దిదారుల సంతోషాల‌తో సంక్రాంతి పండుగ‌లా క‌ళ‌క‌ళ్లాడాల్సిన ఆ గృహ‌స‌ముదాయాలు.. ఇప్పుడు నిర్మానుష‌మై.. బూజుప‌ట్టి పోయి.. బూత్ బంగ్లాలుగా మార్చిన క‌క్ష సాధింపు ధోర‌ణి సీఎం జ‌గ‌న్‌రెడ్డిదే అంటూ ల‌బ్దిదారులు మండిప‌డుతున్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండుంటే అంత మంచి ఇళ్ల‌ల్లో ఉండాల్సిన వాళ్లం.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లో ఎలాంటి ఇళ్లు ఇస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాడు-నేడు అంటూ అప్ప‌డు చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టిన ఇళ్ల‌ను.. ఇప్పుడు జ‌గ‌న్ క‌డుతున్న ఇళ్ల‌ను కంపేర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో పోస్టులతో పాటు సెటైర్లూ పెడుతున్నారు. ప‌క్కా ఇళ్లు పోయి తొక్క‌లో ఇళ్లు ఇస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌లు అంటున్నార‌ని కాదుగానీ.. ఓసారి మీరు వ‌చ్చి ఆ ఇంట్లో ఓ రోజు కాపురం ఉండండి జ‌గ‌న్‌రెడ్డి గారు.. అప్పుడు తెలుస్తుంది మీరు క‌ట్టిస్తున్న ఇల్లు.. ఉండ‌టానికి ప‌నికొస్తుందో లేదో... అంటూ కామెంట్ల‌తో  కాక పుట్టిస్తున్నారు. 
 

By
en-us Political News

  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.