జగన్ వైజాగ్ ఆశలు ఆవిరి.. షిఫ్టింగ్ ఇక లేనట్లే!

Publish Date:Jun 29, 2023

Advertisement

త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధాని కాబోతుంది.. నేను కూడా త్వరలోనే విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నా. ఇదీ ఢిల్లీలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇప్పటికి ఐదు నెలలు గడిచింది. ఆ మాటకొస్తే విశాఖ గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు అసెంబ్లీలో, మీడియా సమావేశాలలో, పలు కార్యక్రమాల సభలలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. విశాఖ నుండే పరిపాలన సాగుతుందని.. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. నాలుగు రోడ్లు, ఇంకో ఐదారు బిల్డింగులు కట్టుకుంటే అదే రాజధాని అవుతుందని చెప్పారు. ఒకసారి ఈ సంక్రాంతికి వైజాగ్ వెళ్తామని.. ఇంకోసారి ఈ దసరాకే ఫిక్స్ అని ఎప్పటికప్పడు ముహుర్తాలు మారాయి కానీ.. జగన్ మాత్రం తాడేపల్లి పాలెస్ దాటలేదు.  

 ఒక దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు వైజాగ్ లో ఇంటి కోసం అధికారులు సెర్చ్ మొదలు పెట్టారని, బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారనీ కూడా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటికీ జగన్ మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. విశాఖ నుండే పరిపాలన అన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అయితే  అసలు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా? రాజధాని ఎలా ఉన్నా ఆయనే చెప్పినట్లు విశాఖ నుండే పరిపాలన సాగిస్తారా? లేక ఇప్పటి వరకు విశాఖ గురించి చెప్పిన మాటలన్నీ ఉత్తి మాటలేనా? అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.

అందుకు తగ్గట్లే విశాఖ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాయి. జగన్ ఇక విశాఖ రావడం కలేనని భావించాలని గంటా వెల్లడించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖలో వైసీపీ ఎంపీ కుటుంబాన్నే నగరం నడిబొడ్డున కిడ్నాప్ చేసిన విషయాన్ని అందరూ చూశారన్న గంటా.. ఆ సంఘటన చూశాక ఇక సీఎం జగన్ విశాఖపట్నానికి రాలేరన్నారు. విశాఖకు ప్రస్తుత పరిస్దితుల్లో ప్రముఖులు గానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కానీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అందుకే సీఎం జగన్ కూడా విశాఖ రారని తాను అంచనా వేస్తున్నట్లు గంటా చెప్పుకొచ్చారు. విశాఖకు రావాలన్న తన ఆలోచనను సీఎం జగన్ మానుకుంటారని ధీమాగా చెప్పారు. 

అంతే కాదు, సీఎం జగన్ విశాఖకు వస్తే ఏ విశ్వసనీయతతో ఆయన ల్యాండ్ పూలింగ్ చేస్తారని అందరూ అడుగుతున్నారని గంటా శ్రీనివాస్ ప్రశ్నించారు. అదే సమయంలో వైజాగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపైనా గంటా కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ లో అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రమంతా కలకలం రేపితే.. డీజీపీ మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని, పోలీసులు భేషుగ్గా పని చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 

గంటా సంగతెలా ఉన్నా ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇక జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం కష్టమే. ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. నిండా పది నెలలే  సమయం ఉంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రాజధాని అమరావతి వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందో క్లారిటీ లేదు. మరో వైపు విశాఖలో పరిస్థితులకు ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదంతమే అద్దం పడుతోంది. ఎన్నికల సమయానికి చక్కదిద్దుకోవాల్సిన అంశాలు ఇప్పటికే జగన్ కు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి విశాఖకు తరలి వెళ్తారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అన్నట్లు అసలు వైసీపీ కాన్సెప్ట్ విశాఖను రాజధానిని చేయాలనుకోవడం కంటే అమరావతిని నాశనం చేయడం.. రాష్ట్రానికి అనువైన రాజధాని లేకుండా చేయడమే. మరి అది ఎలాగూ జరుగుతుంది కనుక విశాఖ అంశంలో  జగన్ లైట్ తీసుకోవడం విడ్డూరం ఏమీ కాదు!

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.