కోటలు దాటిన మాటలు.. గడపదాటని చేతలు

Publish Date:Apr 4, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేదలను ఉద్ధరించడానికే అవతరించానంటూ తన భుజాలు తానే చరుచుకుని మరీ గొప్పగా ప్రచారం చేసుకుంటారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 90శాతానికి పైగా అమలు చేసేశానని గప్పాలు కొట్టుకుంటారు. అయితే వాస్తవంలో ఆయన ఇచ్చిన హామీలలో పూర్తిగా నెరవేర్చినవి ఏమిటన్న లెక్కలు వేస్తే.. ఏ హామీ కూడా పూర్తిగా నెరవేరలేదనే తేలుతోంది. హామీలు అమలు చేస్తున్నా.. బటన్ నొక్కి క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నా అని చెప్పుకుంటున్న జగన్..బటన్ నొక్కిన ఎన్ని రోజులకు ఖాతాలలో డబ్బులు పడుతున్నాయో మాత్రం చెప్పరు. 

ఇప్పుడు సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలోనూ అదే జరుగుతోంది. వలంటీర్లపై ఈసీకి ఫిర్యాదులు చేసి వారిని పించన్ల పంపిణీకి దూరం చేసిన తెలుగుదేశం కారణంగానే అవ్వా తాతలకు సమయానికి పింఛన్లు అందలేదని చెప్పుకుంటున్న జగన్.. వాస్తవానికి వారికి పింఛన్లు పంపిణీ చేయడానికి ట్రెజరీలో సొమ్ములు లేవన్న విషయాన్ని దాచిపెట్టడానికి శతథా ప్రయత్నించారు. అయితే నిమ్మల రామానాయుడు జగన్ బాగోతాన్ని బట్టబయలు చేశారు. పంచాయతీల ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడం  వల్లనే పింఛన్ల పంపిణీ జరగడం లేదన్న వాస్తవాన్ని నిమ్మల బయటపెట్టారు.  ఇలా ఒక్కటని కాదు.. ప్రతి పథకం అమలులోనూ జగన్ కుటిలత్వం, కపటత్వం బయటపడుతూనే ఉంది.

పాఠశాల పిల్లలకు పోషకాహారం అంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకున్న జగన్..   పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు, చిక్కీ ఇస్తున్నామంటూ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రకటనలు గుప్పించుకున్నారు.  ల్లలకు మేనమామ ఇస్తున్న బహుమతిగా  చెప్పుకున్నారు.  అయితే ఇప్పుడు   పిల్లలకు భోజనంలో కోడిగుడ్డు, చిక్కీలు బందయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ఏమిటా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. యథా ప్రకారం వాటిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ బిల్లులు ఇవ్వలేదు. బిల్లులు రేపిస్తాం, మాపిస్తాం అంటూ ఇప్పటిదాకా బండినడిపేసిన జగన్ సర్కార్ కారణం అవి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు, జగన్ సర్కారు ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వకపోవడమేనట. బిల్లులు వచ్చే నెలలో ఇస్తామంటూ ఈ ఫిబ్రవరి దాకా లాగించిన జగన్ సర్కారు.. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని చేతులెత్తేసిందని కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. 

 jyడిగుడ్లు, చిక్కీ సరఫరా దారులకు ప్రభుత్వం, ఈ ఫిబ్రవరి వరకూ 189 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది.   చిక్కీ సరఫరాచేసే కాంట్రాక్టర్లకే 52 కోట్ల బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో  కాంట్రాక్టర్లు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే వాటిని సరఫరా చేస్తామనీ, లేకుంటే లేదని బల్లగుద్దినట్లు చెప్పేశారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇప్పుడు బిల్లులు చెల్లించే అవకాశమే లేదు.  అసలు మామూలు రోజుల్లేనే బిల్లులు ఇవ్వని జగన్ సర్కారు.. ఇప్పుడు ఇంకేమి ఇస్తుందని కాంట్రాక్టర్లు.. చిక్కీ,కోడిగుడ్ల సరఫరాను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. హామీలు ఇచ్చేయడం తరువాత సొమ్ములు లేవంటూ చేతులెత్తేయడం ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ కు ఒక రివాజుగా మారిపోయింది. అమ్మ ఒడి నుంచి తీసుకుంటే.. జగన్ సర్కార్ అమలు చేస్తున్న అన్ని పథకాల పరిస్థితీ దాదాపుగా ఇలానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.