భూములు తెగనమ్మెందుకు కుట్ర!.. అమరావతి వినాశనమే జగన్ అజెండా?!

Publish Date:Sep 4, 2023

Advertisement

ఏపీ రాజధాని అమరావతి.. ఈ మాట వినేందుకు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఏపీకి మూడు రాజధానులు అనే కొత్త నినాదాన్ని అందుకున్నారు. రాజధానిగా అమరావతి ఉండేందుకు జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగేళ్లుగా అందరూ అంటున్నది. వింటున్నది అదే.  ఏది ఏమైనా అమరావతి రాజధాని కాకూడదన్నదే వైసీపీ నినాదం, విధానం. అజెండా.  ఇందుకోసం కమ్మ రాజధాని, రాజధాని భూములలో అవినీతి, రాజధాని కట్టేందుకు నిధులు లేవు.. ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు చెబుతూ సీఎం జగన్ ఇప్పటి వరకూ కాలం గడిపేశారు.

సీఎంగా జగన్ ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసినా ఆ రాజధాని క్రెడిట్ అంతా అందుకు పునాది రాయి వేసిన చంద్రబాబుకే వెళ్తుంది. ముందు ముందు తరాలు అమరావతి చరిత్ర తీస్తే ముందు పేరు చంద్రబాబుదే వస్తుంది. ఆ కారణంగానే జగన్ అమరావతి అంటేనే ముఖం చిట్లిస్తున్నారు. దానిని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రగతిని, ప్రయోజనాలనూ కూడా పక్కన పెట్టేశారు.  సవాలక్ష కారణాలు చెబుతూ అమరావతిని నాశనం చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా ఒప్పుకొనే పరిస్థితిలో లేరు. కోర్టులు మొట్టికాయలు వేసినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వంలో  చలనమే లేదు. అందుకే జగన్ సర్కార్  అధికార పగ్గాలు చేపట్టీ పట్టడంతోనే అమరావతిని స్మశానంతో పోల్చారు. అంతకు ముందు రేయింబవళ్లు పెద్దఎత్తున సాగిన రాజధాని నిర్మాణ పనులను ఎక్కడిక్కడ నిలిపేశారు. గతంలో చంద్రబాబు దేశ విదేశాల కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి వారిని వెళ్లగొట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ళలో  ఒక్క  ఇటుక పెట్టిన పాపాన పోలేదు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ మభ్య పెట్టడమే తప్ప ఒక్క రాజధానికి కూడా కనీసం భూమి పూజ చేసిన పాపాన కూడా పోలేదు. 

గత ప్రభుత్వం మొదలు పెట్టిన నిర్మాణాలు ఈ నాలుగేళ్ల కాలంలో శిథిల దశకు చేరుకుంటున్నా పట్టించుకో లేదు. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం కూడా రాజధాని అమరావతిని పట్టించుకుని ఉండే ఇప్పటికే దాదాపుగా   పనులు పూర్తయ్యేవి. లక్షల కోట్లతో మొదలైన అమరావతి.. ఇప్పటికే వేలకోట్ల సంపద సృష్టించే నగరంగా మారి ఉండేది. కానీ, కక్ష పూరిత విధానాలతో ఈ ప్రభుత్వం రాజధానిని నాశనం చేయడమే కాకుండా.. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం  ప్రభుత్వం వచ్చినా అమరావతి ముందుకు కదలకుండా ఉండేందుకు  రకరకాల కుయుక్తులు పన్నుతోంది. ఇం దులో భాగంగానే ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలిస్తాం.. ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం పన్నిన కుట్రను కోర్టులు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఈ పట్టాలు, ఇళ్ల నిర్మాణం వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఆ విషయంలో నవంబర్ వరకూ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. 

 ఇళ్ల పట్టాలు, గృహనిర్మాణాల కుట్రను కోర్టు భగ్నం చేయడంతో జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెరతీసింది.  ఏకంగా ఆదాయం కోసం అమరావతి భూములను తెగనమ్మేందుకు నడుం బిగించింది.  తాజాగా రాజధానిలో భూముల అమ్మకం కోసం జగన్ ప్రభుత్వం రెండు (389, 390) జీవోలు జారీ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం స్పెషల్‌ జోన్‌లో ఉన్న మంగళగిరి మండలం నవులూరు రెవెన్యూలో పది ఎకరాలు, తుళ్ళూరు మండలం పిచుకలపాలెం రెవెన్యూలో నాలుగు ఎకరాలను అమ్మకానికి పెట్టారు. స్పెషల్‌ జోన్‌లో ఉన్న రాజధాని భూములను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కోర్‌ క్యాపిటల్‌లో రెండు చోట్ల 14 ఎకరాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నవులూరులో ఎకరా 5.94 కోట్లు, పిచ్చికలపాలెంలో 5.41 కోట్లుగా ధర నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ వేలం ప్రకటన జారీ చేసింది. 

అయితే అమరావతి అభివృద్ధి కోసమే తాము భూముల వేలానికి  పెడుతున్నట్టు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇలా అమరావతి భూములను వేలానికి పెట్టడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే వేలం ప్రకటన చేశారు. కానీ స్పందన లేక ఆగిపోయారు. ఇప్పుడు ఈ వేలానికి వచ్చే స్పందనకు అనుగుణంగా తదుపరి ప్రణాళికలను రచించనున్నారు. అంటే ఈ భూముల వేలానికి వచ్చే స్పందనను బట్టి మిగతా భూములను కూడా వేలం వేయనున్నట్లు ప్రభుత్వం   చెప్పకనే చెబుతోంది. మరోవైపు వేలం పేరిట ప్రకటనను ఇచ్చేసి.. కోట్లు పలికే ఆ భూములను తమ వారికి అప్పనంగా కేటాయించే ఆలోచనలో ఉన్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. మరి భేముల వేలం ప్రకటనకు వచ్చే స్పందన ఎలా ఉంటుందో? ఈ ప్రకటనపై అమరావతి రైతుల రియాక్షన్ ఏమిటో చూడాల్సి ఉంది.  అసలు రాజధాని వేలం ప్రకటనపై అమరావతి రైతులు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.