తుగ్లక్ లా జగన్ తీరు ఉందన్న జయప్రకాశ్ నారాయణ్

Publish Date:Oct 17, 2022

Advertisement

మూడు రాజధానులంటూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పట్ల క్రమంగా అన్ని వర్గాలలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై పెద్దగా నోరు మెదపని వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి జగన్ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు.

ఆ క్రమంలోనే లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్.. మూడు రాజధానులంటూ వైసీపీ, జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. గతంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా రాజధానిగా అమరావతిని గుర్తు చేశారని ఆయన గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా తుగ్లక్ కూడా తరచుగా రాజధానులను మార్చిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రబుత్వానికి రాష్ట్ర రాజధానికి మార్చే హక్కు ఇసుమంతైనా లేదని విస్పష్టంగా తేల్చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై జయప్రకాశ్ నారాయణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు అంటున్న జగన్ సర్కార్ ఆరు నూరైనా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, వికేంద్రీకరణే తమ విధానమని వైసీపీ చెబుతున్నది.  కాగా అమరావతే రాజధాని అంటూ ఆ ప్రాంత  రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో, ఆ యాత్ర విశాఖ ప్రవేశించరాదన్న తలంపుతో వైసీపీ విశాఖ గర్జన్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే  రాజధాని అంశంపై లోక్ సత్తా  అధినేత జయప్రకాశ్ నారాయణ  ఏపీకి రాజధాని అమరావతే అని ఆయన తేల్చి చెప్పారు.

తుగ్లక్ తరచూ రాజధానులను మార్చిన సంగతిని ప్రస్తావించిన ఆయన జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని అన్నారు. జగన్ సర్కార్ రాజధానిపై ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తోందని అన్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు రాజధానిపై విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనడం సరికాదని జయప్రకాశ్ అభిప్రాయపడ్డారు.   ఒక సార్వభౌమ అధికారం ఉన్న ప్రభుత్వం ఇండిపెండెంట్ గా హామీ ఇచ్చిన తర్వాత, రాతపూర్వకంగా ఒక కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత వెనక్కి వెళ్లే హక్కు లేదని హైకోర్టు చెప్పిందని ఆయన పేర్కొన్నారు.  రాజధాని అంశంపై తారస్థాయిలో రగడ జరుగుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతే అంటూ జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.