జగన్ ‘ద్వంద్వ మతతత్వం’ గోల!

Publish Date:May 16, 2024

Advertisement

కొంతమందికి రెండు దేశాల్లో పౌరసత్వం వుంటుంది. దాన్ని ‘ద్వంద్వ పౌరసత్వం’ అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ వ్యవహారాన్ని చూస్తుంటే ‘ద్వంద్వ మతతత్వం’ అనే పదాన్ని సృష్టించాలని అనిపిస్తోంది. జగన్ పూర్వికులు ఏనాడో హిందూ మతాన్ని వదిలి క్రైస్తవాన్ని స్వీకరించారు. జగన్ కుటుంబం మొత్తం నిరంతరం ఏసు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ వుంటారు. మంచిదే.. ఎవరి మత విశ్వాసాలు వారివి. అమెరికా పారిపోయిన విజయమ్మ అయితే, గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు చేతిలో బైబిల్ లేకుండా ఏనాడూ కనిపించలేదు. హిందూ మతానికి దూరమైపోయినప్పటికీ ఈ కుటుంబం ‘రెడ్డి’ అనే హిందూ కులాన్ని మాత్రం అక్కున చేర్చుకుంది. ఇది వీరి పెద్ద మనసుకు నిదర్శనం. అసలు ఈ కుటుంబం రెడ్లే కాదని, రెడ్ల ఓట్ల కోసమే ఆ మకుటం తగిలించుకున్నారని కొంతమంది నిఖార్సయిన రెడ్లు వాదిస్తూ వుంటారుగానీ, ఆ వాదనలోకి ఇప్పుడు వెళ్ళడం అనవసరం. అటు క్రైస్తవ మతానికి, ఇటు హిందూ కులానికి న్యాయం చేస్తూ ఈ కుటుంబం చాలా అభివృద్ధిలోకి వచ్చింది.. సంతోషం!

అయితే, ఆమధ్య... అంటే, 2019 ఎన్నికలకు ముందు విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి అండ్ జగన్ రాసుకుని పూసుకుని తిరిగిన రోజుల్లో ఆయన ఓ ఫైన్ మార్నింగ్ జగన్‌ని నీళ్ళలో ముంచి, పైకి లేపి హిందువుగా మార్చేశారు. దాంతో హిందుత్వ భావాలు వున్నవాళ్ళందరూ మురిసిపోయారు. అయితే ఆ మురిపెం ఎక్కువకాలం మిగల్లేదు. ఆ తర్వాత జగన్ ఏనాడూ వ్యక్తిగత హోదాలో ఏనాడూ ఏ హిందూ దేవాలయానికి వెళ్ళిన ధాఖలాలు లేవు. యథాతథంగా క్రైస్తవ మత ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం, జెరూసలేం వెళ్ళడం లాంటివి జరిగిపోతూనే వున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు జగన్ ప్రవర్తించే తీరు జగద్విదితమే. దేవాలయంలో ఇచ్చే ప్రసాదాలు, తీర్థాలు తీసుకుంటున్నప్పుడు ఆయనలో అయిష్టత స్పష్టంగా కనిపిస్తూనే వుండేది. హిందూ మత విశ్వాసాలను పాటించకపోయినప్పటికీ, హిందూ దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతర మతాల వారికి మళ్ళించినప్పటికీ, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఏమీ చేయలేక సర్వం మూసుకున్న పరిస్థితి. జగన్ తన క్రైస్తవంలోనే కొనసాగుతున్న యథాతథ పరిస్థితి.

అదేంటో, ఎన్నికల సమయం రాగానే మరోసారి జగన్‌ మనసు హిందూ విశ్వాసాల మీదకి మళ్ళింది. అధికారాన్ని వచ్చేలా చేసే రాజశ్యామల యాగం మీద మక్కువతో ఆయన గత 41 రోజులకు పైగా తాడేపల్లి నివాసంలో సీక్రెట్‌గా రాజశ్యామల యాగం క్రతువులు పూర్తి చేశారు. యాగం చివరిరోజైన బుధవారం నాడు జరిగిన పూర్ణాహుతిలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా విశాఖ శారదాపీఠంలోని ఆలయంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలితంగానే తనకు అధికారం దక్కిందని జగన్ నమ్ముతున్నట్టున్నారు. అందుకు ఈసారి కూడా రాజశ్యామల యాగం ప్లాన్ చేశారు. కాకపోతే, స్వరూపానందేంద్ర సరస్వతితో జగన్‌కి చెడింది కాబట్టి, ఇప్పుడు ఆ బాధ్యత మరెవరో స్వీకరించి పూర్తి చేశారు.

అంతా బాగుందిగానీ, ఇంతకీ జగన్ హిందువా, క్రైస్తవుడా అనే సందేహం, అయోమయం అటు హిందువులలో, క్రైస్తవులలో పెరిగిపోతోంది. సర్లే, ఏ మతం అయితే ఏం గానీ, వున్నది ఒకే దేవుడు.. కనిపించేవనీ దేవుడి రకరకాల రూపాలు అంతే.. ఇంతకీ ఆయన చేసిన రాజశ్యామల యాగం ఈసారి ఫలిస్తుందా? కచ్చితంగా ఫలించదు. ఎందుకంటే, రాజశ్యామల దేవత కూడా ఓటరు దేవుళ్ళ లాంటిదే. అప్పట్లో జగన్ ‘ఒక్క ఛాన్స్’ అని ప్రాధేయపడ్డాడు కాబట్టి, ఓటరు దేవుళ్ళ తరహాలోనే రాజశ్యామల దేవత కూడా కరుణించి అధికారం ఇచ్చింది. ఈ ఐదేళ్ళ పాలనలో జగన్ నిజ స్వరూపం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి, ఇటు ఓటరు ఓటు వేయలేదు.. అటు రాజశ్యామలా దేవి కూడా కరుణించదు. 

రాజశ్యామలా దేవి కూడా ఓటరు దేవుడి లాంటిదే జగనప్పా.. ఓటరు బూత్‌కి వచ్చి ఓటు వేస్తాడు.. రాజశ్యామలాదేవి అలా ఓటు వేయకుండానే అనుగ్రహిస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్.. అయినా, జగన్ అంటే పడిచచ్చే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.