కాలం ఎంత విచిత్రమైనదంటే.. ఒకప్పుడు మీకు కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలను అంటూ అహంకార పూరితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జగన్ ఇప్పుడు ఆయనే అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా లేకుండా నిలిచారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. సరిగ్గా అదే సమయంలో ఒకప్పుడు ఈ శాసన మండలి అన్నదే వృథా ఖర్చు, కాలయాపన అన్న జగన్ నేడు అదే శాసన మండలిని ఆధారం చేసుకుని తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు.
బొత్సను ఎమ్మెల్సీని చేసి, తద్వారా ఆయనకు మండలి ప్రతిపక్ష నేత హోదా కల్పించి, ఇక్కడ తమ ఉనికి కాపాడుకునే యత్నం చేస్తున్నారు జగన్. నాడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని బీరాలు పలికిన జగన్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా సభకు వెళ్లలేక గైర్హాజరవుతున్నారు. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికలలో వైపీపీకి కేవలం 11 స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష హోదాకు ఉండాల్సిన 18 సీట్ల సంఖ్యా బలం లేక పోవడతో ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక జగన్ అసెంబ్లీకి కేవలం పులివెందుల ఎమ్మెల్యే హోదాలో మాత్రమే హాజరు కావాల్సిన పరిస్థితి. అందుకే గైర్హాజరౌతున్నారు అది వేరే సంగతి. అదే శాసన మండలిలో మొత్తం 58 సీట్లుండగా.. ప్రస్తుతం 30 సీట్లతో వైసీపీ బలంగా ఉంది. దీంతో మండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులను అడ్డుకోవడం, లేదా చర్చకు పట్టుబడే అవకాశం వారికి మండలిలో లభిస్తోంది.
గతంలో ఇదే జగన్ మండలిని రద్దు చేయాలని తీర్మానం చేశారు జగన్. ఎందుకంటే అప్పట్లో అసెంబ్లీలో వైసీకీ భారీ మెజారిటీ ఉన్నా.. మండలిలో మాత్రం లేదు. అప్పట్లో టీడీపికి శాసన మండలిలో మెజారీ ఉండేది. దీంతో మూడు రాజధానుల బిల్లు వంటి కీలక నిర్ణయాలను మండలిలో టీడీపీ అడ్డుకునేది. దీంతో మండలి వల్ల ప్రజా ధనం వృధా, కాలయాపన అంటూ ఈసడించిన జగన్ ఇప్పుడుఅదే మండలి నుంచి తమ పార్టీ వాయిస్ వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మరో విచిత్రమేంటంటే.. ఆ తర్వాత మండలిలో వైసీపీకి మెజారిటీ రావడంతో 2021 నాటి రద్దు తీర్మానాన్ని నాటి జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
అహంకారం పనికిరాదనీ, వ్యవస్థలను అవగాహనారాహిత్యంతో తప్పు పట్టరాదని.. ఈ ఉదంతంతో తెలుస్తోందంటున్నారు పరిశీలకులు. వ్యవస్థల పట్ల కనీస గౌరవం లేక పోవడం వల్ల వచ్చిన ఇబ్బందిగా దీన్ని అభివర్ణిస్తూ.. ఇప్పటికైనా తెలిసివచ్చిందా జగన్? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-praposed-to-cancil-when-in-power-25-215144.html
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.