జగనేంటి కొత్తగా బొట్టుపెట్టుకుని బయలు దేరారు?
Publish Date:Jul 30, 2025
Advertisement
జగన్ ప్రెస్ మీట్లకు.. ఈ మధ్య రాముడు మంచి బాలుడికి మల్లే వచ్చేస్తున్నారు. భల్లే భల్లే కబుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయన కబుర్లన్నీ పేపర్లూ, టీవీల్లో వచ్చేస్తాయి. కాదనడం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మరీ బుద్ధిమంతుడ్లా కనిపించడమేంటా? అన్నది ఒక అనుమానం. ప్రశ్న. చర్చ. వగైరా వగైరా. జగన్ కి ఎల్వీ సుబ్రహ్మణ్యం దగ్గర తగిలింది హిందూత్వ దెబ్బ. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఆయన హిందూ ఆలయాల్లో అన్యమతస్తులను తీసి వేస్తూ జీవో తేబోతే క్రిష్టియన్ సంఘాలు వద్దని వారించడం.. ఎల్వీ వినక పోవడం.. దీంతో ఆయన్ను జీఏడీకి అటాచ్ చేయడంతో స్టార్టయ్యింది జగన్ క్రిష్టియన్ సీఎం అనే ముద్ర పడడం. దీంతో ఎల్వీ సైతం తప్పుకోవడంతో క్రిష్టియన్ సంఘాలు కేక్ కట్ చేసుకుని సంబురాలు చేసుకున్నాయి. గానీ అది జగన్ పార్టీకి ఆశనిపాశంగా మారినట్టు అంచనా వేస్తారు. దీంతో ఈ ముద్ర చెరుపుకోడానికి తన ఆస్థాన స్వామి స్వరూపానందేంద్ర చేత యజ్ఞ యాగాదులు చేయించారు. ఆపై ఎన్నెన్నో ఇతరత్రా హిందూ క్రతువులు చేయించారు. కానీ ఆ మరక ఆయన్ను మాత్రం వీడిపోలేదు. ఇక లాభం లేదని లాస్ట్ స్టేజ్ లో ఇంట్లో సెట్ వేసి.. తన భార్య చేత ప్రసాదం పేపర్లో చుట్టించారు. అయినా జనం నమ్మలేదు. ఫైనల్ గా జగన్ ఒక క్రిష్టియన్ సీఎం అని బ్రాహ్మణ- వైశ్య- క్షత్రియ, కమ్మ.. వారితో పాటు సాటి రెడ్డి కులస్తులు సైతం నమ్మారు. కట్ చేస్తే హిందూ వర్గాల్లో చాలా వరకూ ఇదే నిజమని భావించి.. ఆయన పుట్టి నిండా ముంచారు. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇప్పుడు చూస్తే ఎలాగైనా సరే ప్రో హిందూగా ఒక కలరింగ్ ఇవ్వడానికా అన్నట్టు.. ఈ ఉండమ్మ బొట్టు పెడతా నాటకానికి తెరలేపినట్టున్నారు చూస్తుంటే. అందుకే ఇదంతా అన్న చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను మిస్టర్ హిందూ ప్రో మ్యాన్ అనిపించుకోడానికి ఇంకెన్ని వేషాలు వేస్తారో అన్నియ్య అన్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/jagan-new-look-with-sindoor-on-fore-head-25-203077.html





