ఎవడబ్బ సొమ్మని కులికేవు జగన్మోహనా!

Publish Date:Jun 15, 2024

Advertisement

ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అతని పక్కనే వుండే వాళ్ళెవరైనా తన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిందని చెప్పండ్రా.. తానింకా ముఖ్యమంత్రి పదవిలోనే వున్నానని అయ్యగారు భ్రమపడుతున్నట్టున్నారు. అందుకే, ముఖ్యమంత్రిగా ఏయే బిల్డప్పులు ఇచ్చాడో, పదవి ఊడిపోయి ఇన్ని రో్జులైనా తగ్గేదేలే అంటూ సదరు బిల్డప్పుని కంటిన్యూ చేస్తున్నారు.

అయ్యగారు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పుడు క్యాంపు కార్యాలయం దగ్గర జనం డబ్బుతో నిర్మించిన రోడ్డులో అప్పట్లో వేరేవాళ్ళు ఎవర్నీ అనుమతించేవారు కాదు. ఇప్పుడు పదవి ఊడిపోయిన తర్వాత కూడా ఆ రోడ్డు మీద ఎవర్నీ రానివ్వడం లేదు. జగన్ ఆదేశాలతో జగన్ సెక్యూరిటీవాళ్ళు ఆ రోడ్డుని ప్రైవేట్ రోడ్డుగా మార్చేశారు. 5 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్డు ఇది. ఈ రోడ్డులోకి ఎవర్నీ రానివ్వకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. 

అలాగే జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేట్ కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో జనం సొమ్ముతో ఇంటి చుట్టూ ప్రహరీ మీద 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, ఇంకా సోలార్ ఫెన్సింగ్ దాదాపు మూడు కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేశారు. జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి మొత్తం ప్రజల సొమ్ముతో కొన్నవే. గతంలో ఈ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయం అని ప్రకటించిన తర్వాత హైదరాబాద్ సచివాలయం హెచ్ బ్లాక్‌లో వున్న యూపీఎస్, కంప్యూటర్లను అక్కడి నుంచి తరలించి ఇక్కడ పెట్టారు. అయితే జగన్ మాజీ ముఖ్యమంత్రి  అయిన తర్వాత, క్యాంపు కార్యాలయాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్న తర్వాత జనం సొమ్ముతో కొన్న ఫర్నిచర్, కంప్యూటర్లు మొత్తాన్ని సొంత పార్టీ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు. 

గతంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వానికి చెందిన రెండు మూడు కంప్యూటర్ల లాంటివి ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదని  ఆయన మీద కేసు పెట్టి, ఆయన్ని మానసికంగా వేధించి, మానసికంగా క్రుంగిపోయేలా చేసి, ఆత్మహత్య చేసుకునేట్టు చేసిన ఈ జగన్ రాక్షసుడు.. ఇప్పుడు మాత్రం తన పదవి ఊడిపోయినా ప్రభుత్వ సామగ్రిని తిరిగి ఇవ్వకుండా తన తాత, తండ్రి సంపాదించిన సొమ్ములా చక్కగా వాడుకుంటున్నారు. మరి అప్పట్లో కోడెల శివప్రసాదరావు మీద కేసులు పెట్టి అంతగా హింసించారే.. ఇప్పుడు ఈ జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ ఒక్క నేరం మీదే ఎలాంటి శిక్ష విధించాలి? కరెక్ట్.గా దొరకాలేగానీ ఈ జగన్ అంతకు అంత అనుభవించడం ఖాయం!

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.