పథకాల్లో కోతలు.. జగన్ మళ్లీ మడమ తిప్పారు! 

Publish Date:Jun 28, 2021

Advertisement

ముందు ఎంతైనా సరే తేవాల్సిందే..ఇవ్వాల్సిందే అన్నారు.  తర్వాత ఏ నిధులైనా మళ్లించాల్సిందే..ఇవ్వాల్సిందే అన్నారు. ఆ తర్వాత అప్పు చేసైనా సరే..ఇవ్వాల్సిందే అన్నారు. ఆ ముచ్చట కూడా తీరాక.. అప్పుల కోసం సర్కారీ భూములు తాకట్టు పెట్టండి..ఏమైనా సరే ఇవ్వాల్సిందే అన్నారు. అది సరిగా కుదరక..ఇప్పుడిక చివరి అంకంలోకి దిగారు. ఆదాయం ఎటూ రాదని తేలిపోయింది కాబట్టి.. ఇక ఖర్చు తగ్గించడమే మార్గం అని డిసైడైపోయారు. కావాలంటే ఎన్నికల ముందు మళ్లీ పెంచుదాం...ఇప్పటికైతే కోసేయండనే ఆదేశాలొచ్చాయి. 

నవరత్నాలు..సంక్షేమ పథకాలు..జగన్ కి ప్రాణం. ఎందుకంటే తాను జైలుకెళ్లినా..అధికారం అట్టిపెట్టేలా చేసేవి అవే మరి. తాము ఏం చేసుకున్నా..జనం మాట్లాడకుండా ఉండటానికి అవే ఆయుధాలు మరి. ఈ విషయంలో అధికారంలోకి రాక ముందే స్కెచ్ రెడీ అయింది. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పందేరం మొదలైంది. రెండు నెలలకోసారి ఏదో ఒక పేరుతో ఒక ఫ్యామిలీకి 10 వేలు వేస్తున్నారు. దీంతో జనం కూడా మిగతా విషయాలు పట్టించుకోవడం లేదనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. రాజధాని తరలించినా.. అక్రమ కేసులు పెట్టినా..మాట విననివారిని వేధించినా...పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అంతా వైసీపీ కార్యకర్తల్లా పని చేసినా కూడా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు పట్టించుకోరనదే వారి కాన్సెప్ట్.

మరి ఈ పథకాలన్నీఅమలు  కావాలంటే డబ్బులెలా? అందుకే ఉన్న డబ్బులన్నీ అటే డైవర్ట్ చేశారు. అప్పులు చేశారు. చివరకు తాకట్టులు పెడుతున్నారు.అయినా ఆదాయమే లేకపోతే..ఎన్నాళ్లనీ సర్దుతారు. ఆదాయం వచ్చే పనులేమీ చేయటం లేదు సరి కదా.. ఉన్న కంపెనీలు పోయేలా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరెంట్ బిల్లు పెంచేది లేదంటూనే..దొంగదారిలో అన్నీపెంచేశారు. ఆస్తిపన్ను విధించారు. ఇవన్నీకూడా సరిపోవటం లేదు. అందుకే ఇప్పుడు కోతలు మొదలెట్టారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు.

పెన్షన్లలో అవకతవకలు అంటూ లక్షల మందిని గుర్తించి..వారికి నోటీసులిచ్చారు. ఇవన్నీ ఉన్నాయని ఇప్పటివరకు తెలియక కాదు..ఇప్పుడు తీసేయాలి కాబట్టి.. ఇప్పుడే తెలిసింది.  మరోవైపు వైఎస్సార్ భీమా పథకంలో కూడా నెంబర్ తగ్గించేస్తున్నారు. ఇకపై అన్నిపథకాల్లోనూ వెరిఫికేషన్ పేరుతో భారీగా సంఖ్య తగ్గించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అమ్మ ఒడి, ఇతర పథకాలన్నిటికి ఇదే రూల్ పెట్టబోతున్నారు. దీంతో ఇప్పుడు లబ్దిదారుల్లో కలవరం మొదలైంది. ఎ

వరికి తీసేస్తారో.. ఎవరిని ఉంచుతారో అనే ఆందోళన మొదలైంది. అందరూ వాలంటీర్లను సంప్రదిస్తున్నారు. పనిలో పనిగా...లోకల్ వైసీపీ నేతలకు చెప్పుకుంటున్నారు...మీరే ఏదైనా చేయాలని. ఇప్పుడే మొదలైన ఈ సెగ.. జిల్లా స్థాయి నేతలకు కొన్నిరోజుల్లో తగలనున్నది. ఆ తర్వాత మంత్రులకు..సీఎంకు చేరుతుంది. అయినా అలా తగులుతుందని ముందే తెలుసు కాబట్టి..  దానిని ఎలా కవర్ చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటారు.కాకపోతే పథకాలు కోల్పోతున్న లబ్ధిదారుల ఆగ్రహం ఎలా ఉంటుందో..వారి రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల రియాక్షన్ గట్టిగానే ఉంది
 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.