జగన్ హామీల్లో అమలైనవి పది శాతం కూడా లేవుగా.. 99శాతం అంటారేం?!

Publish Date:Oct 13, 2023

Advertisement

తాజాగా విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే 99 శాతం హామీలను అమలు చేశామని.. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని ఆదేశించారు. ఇక ఇదే విషయంలో వైసీపీ నేతల ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పేటెంట్ హక్కు కేవలం సీఎం జగన్ కి మాత్రమే ఉందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు ఎంత గుడ్డిగా జగన్ మాయలో ఉన్నారో ఇలాంటి ప్రకటనలు చూస్తే తెలిసిపోతుంది. మాట తప్పడు మడమ తిప్పడు అంటూ గతంలో ప్రచారం చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టేశారు. రాజధాని మార్పు, శాసన మండలి రద్దు లాంటి అంశాల తర్వాత    జగన్  మాట తప్పడు అంటే ప్రజలు నవ్వుతున్నారని వైసీపీ నేతలు గ్రహించి ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో 99 శాతం హామీల అమలు అనే నినాదాన్ని అందుకున్నారు.

అయితే ప్రతిపక్ష పార్టీలు, జనం మాత్రం జగన్ ప్రభుత్వం అమలు చేసింది కేవలం పది శాతం మాత్రమేనని కౌంటర్లు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యంగా పాదయాత్రలో ఆగిన ప్రతిచోటా ఒక హామీని ఇచ్చుకుంటూ వెళ్లారు. అలా తన పాదయాత్ర నుండి ఎన్నికల సమయంలో సభల వరకూ మొత్తం జగన్ 650కి పైగా హామీలను ఇచ్చినట్లు పరిశీలకులు లెక్కతేల్చారు. అందులో చిన్నా చితకా ఏమైనా ఉండనీ కానీ.. జగన్ ఇచ్చిన హామీలను చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే. ఇక హామీల అమలు విషయానికి వస్తే ఆయన ఇచ్చిన 650కి పైగా హామీలలో కేవలం పది శాతం మాత్రమే, అంటే 65 నుండి 100 లోపు మాత్రమే ఏదో మేరకు అమలుకు నోచుకున్నాయని  ఉదాహరణలు, గణాంకాలతో సహా చెబుతున్నారు.   జగన్ తన నోటి నుండి చెప్పి మరచిన వాటిని ఆధారాలతో సహా బయట పెడుతూ ఇది హామీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ చెప్పుకుంటున్న ఆ 99 శాతం హామీలు ఏంటి అనేది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పిన వాటిలో ప్రధానమైనవి సీపీఎస్ రద్దు, మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, 45 ఏళ్లకు పెన్షన్..అలా చెప్పుకుంటూపొతే  కొండవీటి చాంతాడంత లిస్ట్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మద్యం అంటే  స్టార్ హోటళ్లలో దొరికే వస్తువుగా పరిమితం చేస్తానని, ఆ తర్వాతనే ఓట్లు అడుగుతామని ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకపోగా మద్యం ఆదాయాన్ని కూడా వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారు. ఇక మెగా డీఎస్సీ,  ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ సంగతి ఎంత చెప్పుకున్నా దండగే. ఉద్యోగమంటే వాలంటీర్, సచివాలయాలనే చూపిస్తున్నారు. 

మరో కీలకమైన హామీ సీపీఎస్ రద్దు. దీని గురించి వెళ్లిన ప్రతి చోటా చెప్పిన జగన్.. ఇప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెపున్నారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని ఈ హామీని అటకెక్కించారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.3 వేలు పెన్షన్ అన్నారు. కానీ, రియాలిటీలో 63 దాటిన వాళ్ళకే సవాలక్ష కొర్రీలు పెట్టి ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. అదీ ఇప్పటికీ చెప్పిన రూ.3 వేలు కాలేదు. ఇలా, జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి, బహిరంగ సభలలో ఇచ్చిన హామీలే వందలలో ఉండగా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఇంకా వేలల్లో ఉన్నాయి. ఈ హామీలతో పాటు గత ప్రభుత్వాలు తెచ్చిన ఫీజ్ రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ ప్రోత్సాహకాలు లాంటి ఉపయోగకరమైన పథకాలకు నిధులు లేకుండా చేసి వాటిని నీరుగార్చేశారు. మరి ఇవన్నీ ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారులే అనుకున్నారో ఏమో కానీ వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అబద్దాల ప్రచారాన్ని మొదలు పెట్టారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.