నాడు సెంటి మెంట్.. నేడు యాంటీ సెంటిమెంట్!

Publish Date:Apr 17, 2023

Advertisement

అధికారం అందుకోవాలంటే.. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలి... అలా అయితేనే.. అందలం ఎక్కగలమని   వైసీపీ అధినేత జగన్ విపక్ష నేతగా  గత ఎన్నికల వేళ భావించారు. అందుకోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్నే కాదు.. తనకు తాను సృష్టించుకున్న అవకాశాలనూ యథేచ్ఛగా వాడుకున్నారు. అందులో భాగంగానే ఆయన సెంటిమెంట్‌ను.. అయింట్‌మెంట్‌లా ఉపయోగించుకున్నారు.  ఆ క్రమంలోనే  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై జరిగిన కోడికత్తి దాడిని...  అలాగే తన సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తదితర అంశాలను   జగన్ గత ఎన్నికల ప్రచార వేళ.. చాలా చాలా పద్దతిగా వాడుకొని... అధికారాన్ని దక్కించుకోవాలన్న తన లక్ష్యానికి చేరుకొన్నారు. ఈ విషయం ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయనకు అప్పుడు అక్కరకు వచ్చిన సెంటిమెంట్ ఇప్పుడు యాంటీ సెంటిమెంట్ గా మారుతోందంటున్నారు పరిశీలకులు. 

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత  జగన్‌పై కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు.. ప్రజలను   నిర్ఘాంత పరిచాయి. వైయస్ జగన్‌పై కోడికత్తి దాడిలో ఎటువంటి కుట్ర కోణం లేదని దర్యాప్తులో తేలిందని కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక  జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన జనిపల్లి శ్రీనివాసరావు..  తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని కూడా ఎన్ఐఏ తేల్చేసింది. 

అలాగే  2019, జనవరి 17న ఎన్ఐఏకి నిందితుడు శ్రీనివాసరావు.. ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో సైతం సంచలన నిజాలు వెలుగు చూశాయి. కోడికత్తితో పోడిస్తే..   జగన్‌కు ప్రజల్లో సానుభూతి వస్తుందని...  దీంతో ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారని ఎన్ఐఏ ముందు శ్రీను చెప్పారు. అలాగే ఈ కోడి కత్తి దాడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఓ సారి పరిశీలిస్తే.. ఈ దాడి జరిగిన వెంటనే   జగన్ హైదరాబాద్‌కు విమానంలో వెళ్లడం...  అనంతరం స్థానిక సిటీ న్యూరో సెంటర్‌లో చేరడం.. ఆయనకు రెండు రోజులు విశ్రాంతి అవసరమని ఆ ఆసుపత్రి వైద్యుడు చెప్పడం చకచకా జరిగిపోయాయి.  

ఇంకోవైపు వైయస్ జగన్‌పై దాడి చేసిన వెంటనే శ్రీను వద్ద నుంచి 11 పేజీల ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. అందులో పేర్కొన్న అంశాలు.. రేషన్ షాపులకు వెళ్లి రేషన్ తీసుకోనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ నేపథ్యంలో వారి... ఇంటి వద్దకే రేషన్, పెన్షన్ అందించాలంటూ సదరు లేఖలో శ్రీను పేర్కొనడం..   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవే అంశాలు అమలు కావడం ఒక ఎత్తు అయితే..  కోడికత్తి దాడిలో  జగన్‌కి వైద్యం అందించిన వైద్యుడు..  ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటంపై పలు కథనాలు   వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్‌లో .. పలు సందేహాలకు తెరలేచిందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

మరో వైపు గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అంటే 2019, మార్చి 15న వైయస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఈ హత్య చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందంటూ..  నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆరోపణలు గుప్పించారు. ఆ క్రమంలో తన చిన్నాన్నను ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారు? వారు ఏం ప్రయోజనం ఆశించి ఈ దారుణానికి ఒడిగట్టారు? ఈ హత్య కేసు సీబీఐకి అప్పగిస్తేనే కానీ.. నిజానిజాలు బయటకురావంటూ మీడియా ముందుకు వచ్చి   జగన్ డిమాండ్   చేశారు.  

  అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. వివేకా హత్య కేసు మాత్రం ముందుకు కదల్లేదు. విపక్ష నేతగా ఉండగా సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేసిన జగన్ సీఎం అయ్యాకా.. అబ్బే సీబీఐ దర్యాప్తు ఎందుకు అంటూ మాటమార్చారు. దీంతో  హతుడువివేకా కుమార్తె  డాక్టర్ సునీత.. ఒంటరిగా న్యాయపోరాటానికి దిగి..   తన తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనంటూ  పోరాడుతున్నారు. ఆమె పోరాటం ఫలితంగా కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారింది. ఒక తార్కిక ముగింపు దిశగాసాగుతోంది. అదలా ఉంటే..   అటు కోడి కత్తి దాడి కానీ.. ఇటు సొంత బాబాయి వివేకా హత్యను కానీ...  జగన్ అండ్ కోకు అనుకూలంగా సెంటిమెంట్‌ని  పండించి అధికారం కట్టబెట్టింది. ఇక ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. నాడు అదికారానికి దోహదపడేలా సెంటిమెంట్ ను పండించిన ఘటనలే ఇప్పుడు రివర్స్ లో జగన్ కు వ్యతిరేకంగా యాంటీ సెంటిమెంట్ గా మారుతున్నాయి.  

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.