జగన్ కు అవినాష్ నుంచే అసమ్మతి సెగ?!

Publish Date:Jul 10, 2024

Advertisement

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా? జగన్ కు వ్యతిరేకంగా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు పావులు కదుపుతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔననే  సమాధానమే వస్తుంది.

జగన్ ను వైసీపీ శాసనసభాపక్షం తమ నేతగా ఇప్పటికీ ఎన్నుకోకపోవడం, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసలు జగన్ అసెంబ్లీకి హాజరౌతారా లేదా అన్న విషయంలో పార్టీ నేతలు, శ్రేణులకే స్పష్టత లేకపోవడం చూస్తుంటే.. జగన్ కచ్చితంగా సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశంలో లేరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభలో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది సభ్యలు కూడా వైసీపీ నుంచి ఎన్నిక కాలేదు. దీంతో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టి అవమానాల పాలయ్యే కన్నా, పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప లోక్ సభ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.

అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నట్లు   వైసీపీ వర్గాలలో  చర్చ జరుగుతోంది. తాను పులివెందుల అసెంబ్లీ సభ్యునిగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలో అవినాష్ కు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తానని జగన్ ఎంతగా చెబుతున్నా అవినాష్ వినడం లేదని కడప జిల్లా వ్యప్తంగా ఓ చర్చ అయితే జోరుగా సాగుతోంది. గతంలో పలువురికి ఇచ్చిన హామీలను జగన్ విస్మరించిన సందర్భాలను ఉటంకిస్తూ అవినాష్ కడప లోక్ సభ స్థానానికి రాజీనామా చేస్తే తన బతుకు కూరలో కరివేపాకులా తయారౌతుందని అనుమానిస్తున్నారని అంటున్నారు.

జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యుడిగా రాజీనామా చేసి, ఆ స్థానం నుంచి తనను నిలబెడతారని అవినాష్ నమ్మడం లేదు. తాను కడప లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తారు, అందులో అనుమానం లేదు, కానీ జగన్ రాజీనామా చేసిన పులివెందుల స్థానం నుంచి తనకు అవకాశం ఇస్తారని మాత్రం అవినాష్ నమ్మడం లేదని కడప వాసులు అంటున్నారు. ఆ స్థానం నుంచి జగన్ తన సతీమణి భారతిని రంగంలోకి దించుతారని అవినాష్ గట్టిగా నమ్ముతున్నారనీ, అదే జరిగితే తన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడలా మారడం ఖాయమని ఆయన భయపడుతున్నారు.

జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉంటే, తనపై వైఎస్ వివేకా హత్య కేసు ఉందని ఆయన  తన రాజీనామా గురించి అడిగిన వారికి గుర్తు చేస్తున్నారు.  మొత్తం మీద కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలన్న జగన్ ఆశలకు అవినాష్ రెడ్డి ఆదిలోనే గండికొడుతున్నట్లుగా కనిపిస్తోందన్న చర్చ అయితే వైసీపీ వర్గాలలోనూ, కడప జిల్లా వ్యాప్తంగానూ జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.