Publish Date:Jun 17, 2022
పిల్లలు చదువు విషయంలో ఈ మధ్య కాలంలో ఎన్నోరకాల మార్పులు వచ్చాయి. వాటిలో విద్యతో పాటు పిల్లలలో మానసిక ఎదుగుదలకు, సచ్ఛీలతకు దోహదపడేవి ఎన్నంటే జవాబు మాత్రం వెంటనే దొరకదు. గతంలో వలె స్కూలు కాగానే పుస్తకాలు పట్టుకుని అలా ట్యూషన్‌కి పరిగెట్టనవసరం లేదు. ఈ రోజుల్లో పిల్లలకు అంతా ఆన్లైన్ బోధనా సౌకర్యం బాగా అందుబాటులోకి వచ్చేసింది. స్కూల్ అయిపోగానే ట్యాబ్ ల ముందో, స్మార్ట్ ఫోన్లు చేపబట్టుకునో పిల్లలకు పాఠాలు చెప్పేసే యాప్ లు అందుబాటులోకి వచ్చేశాయి.
కొత్తొక వింత అన్నట్లు ఇవి పిల్లలో విద్య పట్ల ఆసక్తి అభిరుచి పెంచేస్తాయని తల్లిదండ్రులూ నమ్మేస్తున్నారు. కాదు కాదు నమ్మేలా అడ్వర్టైజ్ మెంట్లతో యెడ్యూ టెక్ యాప్ లు ఊదరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా వాటకి తోడైంది. నిజానికి ఈ ఎడ్యూటెక్ యాప్‌లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని.. తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని.. భారీగా డబ్బులు గుంజుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో వీటి విజృంభణ ప్రారంభం కాలేదు. బైజూస్ స్టార్టప్‌గా ప్రారంభించి కాస్త ఆదరణ పొందగానే పెట్టుబడులు సమీకరించి.. ఇతర ఎడ్యూటెక్ స్టార్టప్‌లను కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుంది. వాస్తవానికి ఇలాంటి ఎడ్యూటెక్ యాప్ ల వల్ల విద్యార్థుల మనుసులు కలుషితం అవుతాయనీ.. లాభార్జన వీటి లక్ష్యం తప్ప విద్యార్థుల భవిష్యత్ కాదనీ.. విద్యను వ్యాపారం చేసేస్తున్నాయన్న ఆరోపణలు కోకొల్లలు.
ఇప్పటికే యెడ్యూటెక్ లు విద్యార్థుల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నాయంటే చైనా వాటిని తమ దేశంలో నిషేధించింది. పలు దేశాలు అదే దారిలో ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు సైతం యెడ్యూటెక్ యాప్ లపై పలు ఆంక్షలు విధించాయి. వాస్తవం ఇలా ఉండగా..జగన్ సర్కార్ మాత్రం విద్యా విధానంలో పెద్ద సంస్కరణగా అభివర్ణిస్తూ జగన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ తరహా బోధనను అందించాలని సంకల్పించారు.
దీని కోసం దేశంలోనే అతి పెద్ద యెడ్యుకేషన్ టెక్ కంపెనీగా గుర్తింపు పొందిన బైజూస్ లో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ప్రబుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు మరింత నాణ్యమైన విద్య అందించడానికి ఎంతో వీలుంటుందని జగన్ అంటుంటే.. రాష్ట్రంలో విద్యను మరింత నాశనం చేసే యత్నంగా విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ మాత్రం పిల్లలకు మంచి జరుగుతుంది, వారికి కాస్ట్లీ చదువులను అందజేస్తున్నామంటూ వాదిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజమే ఇది నిజంగా కాస్ట్లీ వ్యవహారమే. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల్లో యెడ్యూ టెక్ కు అవసరమైన ఇన్ఫ్రాస్టర్చర్, ఒప్పందం మేరకు చెల్లింపులు కచ్చితంగా ప్రభుత్వానికి కాస్ట్లీయే. కానీ ఇక్కడ వ్యయం, ఖరీదు కాదు.. అసలు వాస్తవం ఇక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల రిక్రూట్ మెంట్ అనేది లేకుండా చేయడమే జగన్ ఉద్దేశం అని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-eyes-to-stop-teacher-recrutment-25-137853.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.