ధర్మాన బ్రదర్స్ కు జగన్ చెక్స్.. దువ్వాడను దువ్వుతున్నది అందుకేనా?

Publish Date:Feb 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ (జగన్ సహా) అసెంబ్లీకి హాజరై 11 నిముషాలు సభలో ఉండి వాకౌట్ చేయడం తెలిసిందే. వాకౌట్ తరువాత సభ బయటకు వచ్చిన జగన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులుతో ఒకింత ప్రత్యేకంగా మాట్లాడారు. దగ్గరకు పిలిచి.. మరీ ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా దువ్వాడను ఒక సారి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమని కూడా ఆదేశించారు.

రాజకీయవర్గాలనే కాకుండా ఈ సంఘటన వైసీపీయులను కూడా విస్మయ పరిచింది. ఎందుకంటే దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా వాస్తవం మాత్రం ఆయనకు ధర్మాన ప్రసాదరావుతో ఉన్న విభేదాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా అదే కారణం చెబుతున్నారు.  

అది పక్కన పెడితే జగన్ దువ్వాడతో ఇక నుంచీ పార్టీ గొంతు బలంగా వినిపించాలని చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇక దువ్వాడ  సస్పెన్షన్ ను ఎత్తివేయడం ఖాయమన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దువ్వాడలా నోరు గట్టిగా పారేసుకోగల వ్యక్తులు పార్టీకి చాలా అవసరమని జగన్ భావిస్తున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత కూడా ఇప్పటి వరకూ జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని దువ్వాడపై సస్పెన్షన్ ఎత్తివేసి కీలక బాధ్యత అప్పగించాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండి కూడా దువ్వాడ లడ్డూ వివాదంపై అధికార కూటమి నేతలపై గట్టిగానే నోరు పారేసుకున్నారని అంటున్నారు.

ఇది పక్కన పెడితే జగన్ దువ్వాడను దువ్వి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమనడం చూస్తుంటే.. జగన్ పార్టీలో సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లకు చెక్ పెట్టే ఉద్దేశంలో ఉన్నారా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి.  ధర్మాన బ్రదర్స్ జిల్లాకే చెందిన దువ్వాడను ప్రోత్సహించడం ద్వారా వారికి చెక్ పెట్టాలని, పార్టీలో వారి ప్రాధాన్యత తగ్గించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి దువ్వాడ ఎంట్రీ ధర్మాన సోదరులపై పార్టీలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో? 

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.