వైసీపీ అధినేత జగన్ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం నుంచి నేర్చుకున్న పాఠం ఏదైనా ఉందంటే అది మీడియా విలువ తెలుసుకోవడం ఒక్కటే. ఒక్క మీడయా విషయంలోనే ఆయన అహాన్ని తగ్గించుకున్నారు. మీడియాకు దాసోహం అంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రెస్ మీటంటే మొహం చాటేసిన జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ ల ద్వారా మాత్రమే తన మొహం జనాలకు కనిపిస్తుందని అర్ధం చేసుకున్నారు. అందుకే ఓటమి తరువాత ఈ నాలుగు నెలలలోనూ ఐదు సార్లు మీడియా ముందుకు వచ్చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన ప్రెస్ ముందుకు వచ్చింది రెండంటే రెండు సార్లు మాత్రమే. అందులో ఒక సారి వీడియో రికార్డింగ్ ప్రెస్ మీట్. అది తీసేస్తే ఆయన వాస్తవంగా మీడియాతో మాట్లాడింది మాత్రం ఒకే ఒక్కసారి. అటువంటి జగన్ ఓటమి తరువాత నాలుగు నెలలలో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రజలలో ఉండాలంటే, ప్రజలకు దగ్గర కావాలంటే మీడియా ద్వారా మాత్రమే సాధ్యం అన్న గ్రహింపునకు వచ్చారు.
సరే జగన్ అహం తగ్గించుకుని, ఓ మెట్టు దిగానని భావించి మరీ ప్రెస్ మీట్లు పెడుతూ జనంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా, ఆయన మాటలూ, బాడీ లాంగ్వేజ్ జనాలను జగన్ కు మరింత దూరం చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా మీట్ ల వల్ల ఆయనకు సానుకూలత మాట అటుంచితే ప్రజల నుంచి ప్రతికూలతే ఎక్కువ వస్తోందని అంటున్నారు.
తరచుగా మీడియా ముందుకు రావడం ద్వారా రాజకీయంగా బలపడాలని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆయన మీడియా ముందుకు రావడం ద్వారా తనకు తాను మరింత నష్టం చేసుకుంటున్నారని, పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రతి సారీ ఆయన మాటలు, చేతలు, హావభావాలూ అన్నీ సామాజిక మాధ్యమంలో ట్రోలింగ్ కు గురౌతున్నాయి. జగన్ ఐదేళ్ల పాలన అరాచకత్వాన్ని నెటిజనులు ఎత్తి చూపుతున్నారు. ఆయన ప్రతి మాటనూ తిప్పికొడుతూ.. గతంలో ఆయన వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ కు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ద్వారా పొందాలనుకుంటున్న మైలేజ్ దక్కడం లేదు. ఆయన పార్టీ క్యాడర్, శ్రేణులూ జగన్ మౌనంగా ఉంటేనే మేలు అని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-changes-his-look-on-media-39-186277.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.