జగన్ ఆస్తులకు తాళాలేసిన ఈడీ
Publish Date:Oct 5, 2012
Advertisement
ఈడీ ఆస్తుల్ని అటాచ్ చేయడం జగన్ కి ఊహించని మరో ఎదురుదెబ్బ. 51 కోట్ల విలువైన ఆస్తులకు దాదాపుగా ఈడీ తాళాలువేసినట్టే లెక్కని ఆర్ధిక నిపుణులు, న్యాయ నిపుణుల అంచనా.. జనని ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కి చెందిన 13 ఎకరాల భూమి, హెటిరో డ్రగ్స్ కి చెంది 36 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్స్ కి సంబంధించిన పధ్నాలుగున్నరకోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడీ సీజ్ చేసింది. ధరల నిర్ణాయక కమిటీ సిఫార్సుల్ని తుంగలో తొక్కిన వై.ఎస్ ప్రభుత్వం 75 ఎకరాల భూమిని అయినవాళ్లకు కట్టబెట్టిందని ఈడీ తేల్చింది. దొడ్డిదారిన లాభపడ్డ అరబిందో ఫార్మా, హెటిరో సంస్థలు జగన్ సంస్థల్లో వెనకదారిగుండా దాదాపు 30కోట్ల రూపాయల పెట్టుబడులుపెట్టారని ఈడీ చెబుతోంది. జగన్ ఆక్రమ ఆస్తుల కేసులో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఈడీ నిర్ధారించింది. సిబిఐ ఈ కేసుకి సంబంధించి దాఖలు చేసిన చార్జ్ షీట్లని ఈడీ క్షుణ్ణంగా పరిశీలించింది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ తోపాటు తనకి సహకరించిన మరికొందరిచుట్టూ ఉచ్చు మరింతగా బిగిసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పీకల్లోతు కూరుకుపోయినట్టేనని కూడా చాలామంది అనుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-assets-case-31-17914.html





